రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు జిల్లాలోని 138 పలు ప్రదేశాల్లో ఏర్పాటు పండుగ వాతావరణంలో జరగాలి…

-కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి నియోజక వర్గం ప్రధాన కార్యస్థానం, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యక్ష ప్రసార వీక్షణ, సిఎం సందేశం కొరకు వెరసి మొత్తం సుమారు 138 ప్రదేశాల్లో పండుగ వాతావరణంలో చేపట్టాలని, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నేడు మండల కార్యస్థాన తహశీల్దార్, ఎంపిడిఓలు బాధ్యతగా సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయడం జరిగిందని, వారు నేడు రాత్రి బయల్దేరడం జరుగుతుందని తెలిపారు. ప్రతి బస్ కు ఒక నోడల్ అధికారిని నియమించామని, రేపు ఉదయం సూచించిన ట్రాన్సిట్ పాయింట్ కు చేరుకుని ఫ్రెష్ అయిన తర్వాత గౌ. సిఎం ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి వారిని తీసుకు వెళ్లి అనంతరం జాగ్రత్తగా వారిని తిరిగి తీసుకు రావడం జరుగుతుందని, నోడల్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగించామని తెలిపారు. త్రాగునీరు తదితర ఏర్పాట్లు సదరు నోడల్ అధికారి బాధ్యతగా చూసుకోవాలని తెలిపారు. బస్సుకు ఫ్లెక్సీ ఏర్పాటు ఉండాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో విరాజిల్లేల సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు.

అంతే కాకుండా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రజలు వీక్షించేలా మండల స్థాయిలో మండల పరిషత్ మీటింగ్ హాల్ లలో, కమ్యూనిటీ హాల్, నియోజక వర్గాల్లో గుర్తించిన పెద్ద హాల్ లేదా కళ్యాణ మంటపం, మునిసిపల్ హాల్ తదితర వాటిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హాల్ వంటి వాటిలో ప్రజలు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే విధంగా టీవీ, ఇంటర్నెట్, డిష్ ఏర్పాటు ఉండాలని సూచించారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

జిల్లా స్థాయిలో తిరుపతి నియోజక వర్గం కార్యక్రమం కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేశామని, నియోజకవర్గాల వారీగా చూస్తే సత్యవేడు నియోజకవర్గంకి సంబంధించి ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్ నందు, గూడూరు నియోజకవర్గముకు సంబంధించి సి ఆర్ రెడ్డి కళ్యాణమండపం నందు, సూళ్లూరుపేట నియోజకవర్గం కి సంబంధించి ఆర్యవైశ్య కళ్యాణ మండపం , వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎం సి మీటింగ్ హాల్ , శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఎన్టీఆర్ పార్క్ మండల్ ఆఫీస్ పక్కన, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నారావారిపల్లె లోని సిహెచ్సి మీటింగ్ హాల్, ఇవే కాకుండా ప్రతి ఒక్కరూ వీక్షించేలా జిల్లాలోని ప్రతి మండల కార్యస్తానం నందు ఎంపిడిఓ సమావేశ మందిరాలు, కమ్యూనిటీ హాల్ లు, పలు గ్రామ పంచాయతీల పరిధిలోని అంగన్వాడి, పాఠశాల భవన ఆవరణలో, కమ్యూనిటీ కేంద్రాలలోనూ వెరసి మొత్తం 138 ప్రదేశాల్లో ఎల్ఈడి స్క్రీన్, టీవీ, ఇంటర్నెట్, డిష్ సౌకర్యాల ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. ప్రజలు తప్పకుండా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం, సందేశం వీక్షణ చేయాలని కోరారు.

ఎక్కడ కూడా ఎలాంటి అలసత్వం ఉండరాదని, పండుగ వాతావరణంలో సదరు కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *