అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా యం.రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన సియం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశిస్సులు అందించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది రవిచంద్రకు పుచ్చ గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకు ముందు టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న, గుంటురు జిల్లా కలక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి, ఎస్పి తుషార్ గూడి, న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్, ప్రోటోకాల్ డైరక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …