అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ పునః ప్రారంభం

– పేదవాని ఆకలి తీర్చేందుకు పట్టేడు అన్నం పెట్టాలని ఆలోచనతోనే అన్నా క్యాంటీన్..
-రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్ట్యా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలల్లో ప్రాధాన్యత కల్పిస్తుంది.
– నాడు ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించారు.
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్నా క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునః ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ నందు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునః ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లను నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో  వారికి అందుబాటులో ఉన్న ధరతో అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా నేడు  అన్నా క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా  పునః ప్రారంభించుకుంటున్నామన్నారు. 2014-2019 కాలంలో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, రు. 5 రూపాయలకే భోజనం రు. 5 రూపాయలకే అల్పాహారం అందించడం జరిగిందని దీనివలన కోట్లాదిమంది లబ్ధిదారులు ఎంతో ప్రయోజనం పొందారని తెలిపారు. గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలబడతామని స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే నేడు అన్న క్యాంటీన్ పునః ప్రారంభించుకుంటున్నమన్నారు. గత ప్రభుత్వ కాలంలో రు. 2వేల రూపాయలు పెన్షన్ రు. 3 వేల్ చేయడానికి ఐదు సంవత్సరాలు కాలం పట్టిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వ హామీ ఇచ్చిన అనతి కాలంలోనే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు రు. 4 వేల రూపాయలు అందించటంతో పాటు గత ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు వెయ్యి రూపాయలు ఏరియర్స్ రు.3వేల రూపాయలను కలుపుకొని మొత్తం 7వేల రూపాయలను లబ్ధిదారులకు జూలై మాసంలో అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. దివ్యాంగులకు రు. 15 వేల రూపాయలు, రైతులకు గత ప్రభుత్వ బకాయిలను రు. 1600 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. అదేవిధంగా కందిపప్పు బియ్యం వంటి నిత్యవసర వస్తువులకు ప్రజలకు అందుబాటు ధరల్లోనికి తీసుకువచ్చి సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలను మరొకవైపు చేపట్టి అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మన్ననలను పొందుతుందన్నారు. అన్నపూర్ణగా పేరుందిన డొక్కా సీతమ్మ పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా డొక్కా సీతమ్మ   పేరును… డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నాయకులు పేదవాని ఆకలి ఏ మాత్రం పట్టించుకోకుండా విమర్శించారే తప్ప, ఏమి చేయలేదని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు కిలో బియ్యం రు.2 రూపాయలకే అందించారని దానిని స్ఫూర్తిగా తీసుకొని నేడు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనార్థం అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టామన్నారు. వధాన్యులు వితరణసీలులు దాతృత్వంతో అన్నా క్యాంటీన్లకు విరాళాలను అందించేందుకు ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. దాతలు ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ రూపంలో తమ విరాళాలు అందించి “మానవసేవే మాధవ సేవ” అనే విధంగా పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ బి.రాంభూపాల్ రెడ్డి, ఆర్. ఓ, వెంకటేశ్వరరావు, స్థానికనాయకులు రంగా రమేష్, నీలం రామా రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *