మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించి వారి జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శించి, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ఆరా తీశారు. మొత్తం 1,111 ఉత్పత్తులు నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 359 ఉత్పత్తులను ONDC లో నమోదు చేశామని డిపిఎం (లివ్లీ హుడ్) కనకారావు కలెక్టర్కు వివరించగా, ఈ ప్రక్రియ ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Tags machilipatnam
Check Also
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …