Breaking News

Tag Archives: amaravathi

వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై సమీక్షా సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను …

Read More »

అక్రిడేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయిలందరికీ హెల్త్ కార్డులు…

-అంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయ సంఘం వినతిపై కమీషనర్ సానుకూల స్పందన -గతంలో అక్రిడేషన్లతో పనిలేకుండానే డస్క్ జర్నలిస్టులకు ఆరోగ్య భీమా -ఇదే విషయాన్ని విజయ కుమర్ రెడ్డికి వివరించిన అన్నపురెడ్డి, రాజా రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయిల సంఘం వినతిపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల …

Read More »

సిఎస్ ను కలిసి బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ డా.ఆండ్రూ ప్లెమింగ్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటన్ హైకమీషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెకుల వివరాలను సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ హైకమీషనర్ కు వివరించారు.అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అనువైన రంగాలు,ప్రాంతాల వివరాలను కూడా తెలియజేస్తూ ఆయన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషి చేయాలని బ్రిటిష్ హైకమీషనర్ ఆండ్రూ …

Read More »

తెలుగు విద్యార్ధులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావిధాన లక్ష్యం…

-నాడునేడు మొదటిదశ కింద 3600 కోట్లతో 15వేల 714 పాఠశాలల ఆధునీకరణ -రెండవ దశలో మరో 4వేల 456 కోట్లతో పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు -ప్రి-ప్రైమరీ విద్యావ్యవస్థ మరింత పటిష్టతకు నూతన విధానం అన్నివిధాలా దోహదం -ఈవిద్యావిధానంపై త్వరలో ప్రాంతాలవారీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు -రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు విద్యార్ధులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం …

Read More »

వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ యేడాది 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  మంగళవారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలో సీఎం వైయస్‌.జగన్‌ జమ చేసారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం. అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధిక సాయం  ప్రభుత్వం అందిస్తున్నది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి …

Read More »

సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్‌ టీంను సీఎం  వైఎస్‌ జగన్‌ కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు …

Read More »

ఆగస్టు 13 న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్సార్ లైఫ్ అఛీవ్ మెంట్, వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులు ప్రధానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రంగాలలో అసామాన్య సేవలందించిన 60 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ – 2021, వైఎస్సార్ అఛీవ్ మెంట్ – 2021 పురస్కారాలను మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవార్ధం ఆగస్టు 13, 2021 న ఉదయం 11 గంటలకు లబ్బీపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాలునందు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేస్తారు. ఈ కార్యక్రమం ఆసాంతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించబడుతుందని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. …

Read More »

ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం…

-18 ఏళ్లు నిండిన వారు అర్హులు -షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ సోమవారం ఓ ప్రకటన …

Read More »

చేనేతల స్నేహహస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…

-నేతన్నకు ఆపన్న హస్తం.. వైఎస్సార్ నేతన్న నేస్తం… -ఈ నెల 10 వ తేదీన 69,225 మంది నేతన్నలకు మొత్తం రూ. 166.14 కోట్లను బటన్ నొక్కి పంపిణీ ప్రారంభించనున్న -సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి … అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి చేనేత కార్మికుడి అభ్యున్నతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలకు అనుగుణంగా.. జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఇప్పటికే రెండు విడతల …

Read More »

ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం వైఎస్‌ జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేప‌, రావి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు …

Read More »