Breaking News

Tag Archives: gudivada

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు

-రూ. 70 లక్షలతో జెరియాట్రిక్ వార్డు నిర్మాణం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రూ. 2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా …

Read More »

నూతన సంవత్సర వేడుకలకు మంత్రి కొడాలి నాని దూరం రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

– ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం.. -ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలెవరూ రావద్దని మనవి.. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, దీనిలో భాగంగా …

Read More »

శ్రీ విఘ్నేశ్వర స్వామికి డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి మంత్రి కొడాలి నాని పూజలు

-పూర్ణకుంభంతో ఆలయ అర్చకుల స్వాగతం -స్వామివారికి చామర, వింజామరల సేవలు -డిప్యూటీ సీయం..ధర్మాన కృష్ణదాసు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని లకు వేద పండితుల ఆశ్వీరచనం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీవిఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం డిప్యూటీ సీఎం మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు గోపాలశాస్త్రి, …

Read More »

దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు…

-సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నాకు ఇంతటి గౌరవాన్ని సీయం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు.. -వెలమ సంక్షేమానికి విరాళంగా రూ. 3 లక్షలు అందించిన డిప్యూటీ సీయం. -రాష్ట్ర డిప్యూటీ సీయం మరియు రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ -గుడివాడలో మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు -రూ.1.20 కోట్లతో నిర్మించుకోవడం అభినందనీయం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసి ప్రతి …

Read More »

400 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 65 వేల విలువ గల ఉపకణాలు నమోదు..

-విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ పరిధిలో 400మంది విభిన్న ప్రతిభావంతులు రూ . 65 వేల రూపాల విలువ గల ఉపకణాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి బి. రామ్ కుమార్ అన్నారు. స్థానిక కైకాల సత్యనారాయణ మున్సిపల్ ఆడిటోరియంలో మంగళవారం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరాన్ని విభిన్న ప్రతిభా వంతులు …

Read More »

గుడివాడ పట్టణంలో వెలమ సంక్షేమ సంఘ భవన నిర్మాణం అభినందనీయం

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -30 న ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం – ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో ఘన సత్కారం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వెలమ సంఘీయులకు విద్య, సంక్షేమం తదితర కార్యక్రమాల్లో చేయూతనిచ్చిన గుడివాడ పట్టణంలోని గౌతమ బుద్ధ హాస్టల్ స్థలంలో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్లో ఉన్న నివాసంలో …

Read More »

శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

-మంత్రి కొడాలి నానికి శేషవస్త్రాలతో సత్కారం -వేద మంత్రోచ్ఛారణలతో అర్చకుల ఆశీర్వచనం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తదితరులు కలిశారు. మంత్రి కొడాలి నానికి …

Read More »

జలజీవన్ మిషన్ పథకం లో హర్ ఘర్ జల్ గ్రామాలుగా శేరేవేల్పూరు, సిద్దాంతం…

-యంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి త్రాగునీటిని అందించాలన్నదే జలజీవన్ ముఖ్యోద్దేశ్యమని యంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండలం శేరే వేల్పూరులో సోమవారం జలజీవన్ మిషన్ గ్రామ సభను యంపీడీవో ఏ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించగా యంపీపీ గద్దే పుష్పరాణి, జలజీవన్ మిషన్ ప్రతినిధి అధికారులు పాల్గొని గ్రామస్థులకు తాగునీటి వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా యంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. …

Read More »

ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరమును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరములు గుడివాడ యంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …

Read More »