Breaking News

ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరమును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరములు గుడివాడ యంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఏం.అర్. కిట్లు మొదలగు వాటికీ ఎంపిక మరియు గుర్తింపు జరుగును. కావున మండల పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు వారియొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, 4 ఫోటోలతో శిబిరమునకు హజరు అయ్యే విధంగా సచివాలయం సిబ్బందిని మరియు వాలంటీర్లు ను ఆదేశించడమైనదని తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *