Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
-థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి.
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు. స్పందనలో 4 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. :-
కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు. రానున్న నూతన సంవత్సర, సంక్రాతి వేడుకల్లో ప్రజలు గుమిగూడకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
డివిజన్ పరిధిలో రైతులు ఖరీప్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అర్జీలు .- విజయవాడ ప్రసాదంపాడు నివాస్ ఉప్పాల మీనాక్షి తమ అర్జీలో పెదపారుపూడి మండలంలోని భూషణగుళ్ళులో 16.89 సెంట్ల భూమిలోని 968 చ.గ. ఇళ్లు నిర్మించి తన కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడమైనదని, అయితే ఉప్పాల శ్రీను అను అతను తన ఇంటి తాళం పగల గొట్టి ఇళ్లు నాది అని బెదిరిస్తున్నాడు. కావున అధికారులు న్యాయం చేసి తన ఇల్లును అప్పగించాలని వారు అర్జీలో కోరారు.
మండవల్లి మండలం ఉనికిలి గ్రామ నివాశి నిమ్మగడ్డ చంద్రశేఖర్ వర్మ తమ అర్జీలో తన అల్లుడు బొప్పన అప్పాజీ అమెరికాలో ఉంటున్నాడని వారి భూమి 7.42 ఎకరాలను ప్రభుత్వం పర్మిషన్ పొంది చేపల చెరువుగా మార్చడం జరిగిందని, అయితే ఆభూమి అడంగల్లులో వారి పేరు లేదని తెలియజేసియున్నారు. కావున రెవిన్యూ రికార్డుల్లో వారి పేరును నమోదు చేయవసిందిగా కోరారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ.సి.గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *