Breaking News

Tag Archives: gudivada

గుడివాడ పట్టణంలో వెలమ సంక్షేమ సంఘ భవన నిర్మాణం అభినందనీయం

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -30 న ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం – ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో ఘన సత్కారం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వెలమ సంఘీయులకు విద్య, సంక్షేమం తదితర కార్యక్రమాల్లో చేయూతనిచ్చిన గుడివాడ పట్టణంలోని గౌతమ బుద్ధ హాస్టల్ స్థలంలో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్లో ఉన్న నివాసంలో …

Read More »

శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

-మంత్రి కొడాలి నానికి శేషవస్త్రాలతో సత్కారం -వేద మంత్రోచ్ఛారణలతో అర్చకుల ఆశీర్వచనం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తదితరులు కలిశారు. మంత్రి కొడాలి నానికి …

Read More »

జలజీవన్ మిషన్ పథకం లో హర్ ఘర్ జల్ గ్రామాలుగా శేరేవేల్పూరు, సిద్దాంతం…

-యంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి త్రాగునీటిని అందించాలన్నదే జలజీవన్ ముఖ్యోద్దేశ్యమని యంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండలం శేరే వేల్పూరులో సోమవారం జలజీవన్ మిషన్ గ్రామ సభను యంపీడీవో ఏ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించగా యంపీపీ గద్దే పుష్పరాణి, జలజీవన్ మిషన్ ప్రతినిధి అధికారులు పాల్గొని గ్రామస్థులకు తాగునీటి వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా యంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. …

Read More »

ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరమును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరములు గుడివాడ యంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్

-రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని, ఈ పండుగను క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్రీస్తు జన్మించి …

Read More »

రూ.50 లక్షలతో నిర్మించనున్న కౌతరం – వెణుతురుమిల్లి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన..

-జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించి నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని జిల్లా పరిషత్ చైర్ పర్శన్ ఉప్పాల హారిక అన్నారు. బుధవారం గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 50 లక్షల నిధులతో నిర్మించనున్న కౌతరం – వెణుతురుమిల్లి రహదారి నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జడ్పీ …

Read More »

గుడివాడ పట్టణంలోని సినిమా థియేటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ శ్రీను కుమార్.

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్థేశించిన ధరలకు మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని ఆర్డీవో శ్రీనికుమార్ సినిమా థియేట్ల యాజమాన్యానికి సూచించారు. జాయింట్ కలెక్టరు వారి ఆదేశాలు మేరకు బుధవారం గుడివాడ పట్టణంలో తాహశీల్థారు శ్రీనివాసరావుతో కలిసి ఆర్డీవో శ్రీనుకుమార్ పట్టణంలోని పలు సినిమా థియేటర్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన రేట్లను ప్రతి థియేటర్ లో టికెట్ బుకింక్ కౌంటర్ వద్ద మరియు థియేటర్ ప్రవేశ మార్గంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో టికెట్ …

Read More »

తెలుగు సాంఘిక నాటక వికాసానికి కృషి చేసిన తొలి తరం దిగ్గజం పామర్తి

– గ్రంథాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాంఘిక నాటక వికాసానికి కృషి చేసిన తొలి తరం దిగ్గజం పామర్తి సుబ్బారావు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కొనియాడారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజబాపయ్యచౌక్ సెంటర్లో పామర్తి సుబ్బారావు జీవిత చరిత్రపై రూపొందించిన గ్రంథాన్ని మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాటక రంగంలో పామర్తి సుబ్బారావు పాత్ర చారిత్రాత్మకమైనదని …

Read More »

ఆధునిక హంగులతో గుడివాడలో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తా

-రూ.2 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి చర్యలు -రాష్ట్రంలో ప్రప్రథమంగా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఆధునిక హంగులతో గుడివాడ పట్టణంలో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజబాపయ్య చౌక్ సెంటర్లో ఉన్న గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం ఎదుట గుడివాడ …

Read More »