Breaking News

రూ.50 లక్షలతో నిర్మించనున్న కౌతరం – వెణుతురుమిల్లి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన..

-జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించి నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని జిల్లా పరిషత్ చైర్ పర్శన్ ఉప్పాల హారిక అన్నారు. బుధవారం గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 50 లక్షల నిధులతో నిర్మించనున్న కౌతరం – వెణుతురుమిల్లి రహదారి నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జడ్పీ చైర్మన్ హారిక మాట్లాడుతూ తను ఆదరించి గెలిపించిన గుడ్లవల్లేరు ప్రజల రుణం తీర్చుకునేందుకు మంత్రి కొడాలి నాని నాయకత్వంలో మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకారంతో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి కొడాలి నాని అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబ్యాంక్ డైరెక్టర్ పడమటి సుజాత, వైఎస్సార్ సీపీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము, శ్రీ కొండాలమ్మ వారి దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి , సర్పంచ్ కోటప్రోలు నాగు, వైయస్సార్ సిపి నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *