గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్థేశించిన ధరలకు మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని ఆర్డీవో శ్రీనికుమార్ సినిమా థియేట్ల యాజమాన్యానికి సూచించారు. జాయింట్ కలెక్టరు వారి ఆదేశాలు మేరకు బుధవారం గుడివాడ పట్టణంలో తాహశీల్థారు శ్రీనివాసరావుతో కలిసి ఆర్డీవో శ్రీనుకుమార్ పట్టణంలోని పలు సినిమా థియేటర్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన రేట్లను ప్రతి థియేటర్ లో టికెట్ బుకింక్ కౌంటర్ వద్ద మరియు థియేటర్ ప్రవేశ మార్గంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో టికెట్ ధరలను తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్బంగా థియేటర్లలో అందిస్తున్న మౌలిక వసతులు, టిక్కెట్ల రేట్లు వివరాలను థియేటర్ల నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి థియేటర్ల నిర్వహుకులపై చర్యలు తీసుకుని థియేటర్ ను సీజ్ చేస్తామన్నారు. కోవిడ్ నిబంధలను పాటిస్తూ థియేట్ల యాజమాన్యం బాత్ రూమ్స్, టాయిలెట్ మెరుగైన శానిటేషన్ చేయించి శుభ్రంగా ఉంచాలన్నారు. పాప్ కార్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ లను యంఆర్పీ థరకు కు మాత్రమే విక్రయించాలని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ థియేటర్ల నిర్వాహుకులను ఆదేశించారు. తనీఖీలో భాగంగా ఆర్డీవో వెంట తాహశీల్థారు శ్రీనివాసరావు, ఆర్ఐ అరవింద్, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News