Breaking News

Tag Archives: rajamandri

కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

-చెత్త నియంత్రణ  ఇంటి నుంచే ప్రారంభం కావాలి -పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. -ద్విచక్ర వాహనదారులందరూ  తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిశుభ్రత కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో చెత్త నియంత్రణ దిశగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా …

Read More »

పొట్టీలంక నుంచి కడియపు లంక వరకూ బోటు విహారం

-కలెక్టర్ ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడుపు లంక కడియపులంక వరకు కెనాల్ లో బోటింగ్ విహారం చేసే విధానం లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం పర్యాటకశాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి , జిల్లా పర్యటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకపరంగా మరింత అభివృద్ధి …

Read More »

నెలటూరు రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ ఎస్ కె) తనిఖి చేసిన జెసి చిన్న రాముడు

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం ఉదయం చాగల్లు మండలం నెల్లటూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని పౌర సరఫరాలు మార్కెటింగ్ , రెవెన్యు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు …

Read More »

కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రతిపాదన పంపడం జరుగుతుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా పేపర్ లిమిటెడ్, రాజమహేంద్రవరంలో పెండింగ్‌లో ఉన్న కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి తగిన ప్రతిపాదన పంపడం జరుగుతుందని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి లు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పేపర్ యూనియన్ యాజమాన్యాల 10 యూనియన్ల ప్రతినిధులు ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పి …

Read More »

గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి…గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం

-గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. -నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం -ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం -మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం. -ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు -సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలి -ప్రతిపక్ష హోదా అనేది ప్రజలిచ్చేది…గెలిపిస్తే వచ్చేది…బెదిరిస్తే వచ్చేది కాదు -ఒకే రోజున …

Read More »

రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు..

మధురపూడి (కోరుకొండ), నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం హెలి క్యాప్టర్ ద్వారా రాజమండ్రి విమానాశ్రయం చేరుకొన్నారు. అనంతరం అక్కడ నుంచి చాపర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మధురపూడి విమానాశ్రయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అధికారులు ప్రజా ప్రతినిధులు ఘనవీడ్కోలు పలకడం జరిగింది. ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి జిల్లా ఎస్పీ …

Read More »

ఘనంగా కాటా కోటేశ్వరం గ్రామ సభ

-పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి నిడదవోలు( కాటకోటేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచన తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలములోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణచేసి గ్రామ సమస్యలను తెలుసుకొని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల …

Read More »

కలక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన నివాళి

-చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంఘ సంస్కర్త , న్యాయనిపుణుడు, రాజకీయ నాయకుడు, మరియు మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా పనిచేసిన వలసవాద వ్యతిరేక జాతీయ వాది టంగుటూరి ప్రకాశం పంతులు మనందరికీ సదా స్మరణీయుడు అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా …

Read More »

ప్రతిష్టాత్మకంగా గ్రామసభలు

-జిల్లాలో 300 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభలను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు గ్రామసభలు ఏర్పాటుపై మీడియోతో  మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన జరిగే గ్రామసభలలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ,మండల ప్రత్యేక …

Read More »

ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు పై నిర్దిష్టమైన కార్యచరణ సిద్దం

-అక్రమ మైనింగ్ విధానం పట్ల కఠినంగా వ్యవహరిస్తాము -ట్రాన్స్పోర్ట్ ర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే 3 నెలల నిషేధం అమలు చేస్తాం -మీడియా సమావేశం లో కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డీ నరసింహా కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వాటికీ సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు 18004252540 , 0833 – 2417711 కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.   గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద …

Read More »