-ప్రతిపక్షాలు తప్పుడు కథనాలతో ప్రభుత్వం పై బురద జల్లుతున్నాయి – కూటమి ప్రభుత్వం ఖండన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. సోమవారం కొంతమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల వద్ద నుండి అభిప్రాయాలను …
Read More »Tag Archives: rajamandri
గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది
-లంక గ్రామాల్లోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎస్ ఈ కే. గోపినాథ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి వరద నీరు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కూరెళ్ళ గోపీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 30వ తేదీ రాత్రి 8.35 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, సముద్రంలోకి 10,01,410 క్యూసెక్కులు విడిచిపెట్టామని, సెప్టెంబర్ 6 వరకు రోజువారీగా 12 లక్షల …
Read More »పింఛను అర్హత నోటీసులపై అప్పీలు తుది నిర్ణయం వచ్చే వరకు పింఛన్లు యధాతథంగా కొనసాగుతాయి
-ఎంపీడీవో వద్ద అప్పీలు చేసుకునేందుకు ఇంకా అవకాశం -తాత్కాలిక వికలాంగత్వం సర్టిఫికెట్లు ఉన్న అర్హులకు కూడా పింఛన్లు పంపిణీ చెయ్యడం జరుగుతుంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పింఛను అర్హత నోటీసులు అందుకున్న వారు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అప్పీలు సమర్పించుకునే అవకాశం ఇంకా ఉందని, ఇప్పటికే అప్పీలు చేసుకున్న వారికి తుది నిర్ణయం పొందే వరకు పింఛన్లు ఎటువంటి అంతరాయం లేకుండా యధాతథంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. అదేవిధంగా, …
Read More »“LRS Amendments–2025” పై అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా పరిధిలోని మండలాల గ్రామపంచాయతీ సెక్రటరీలు, లైసెన్సు టెక్నికల్ పర్సన్లకు “LRS Amendments–2025” పై అవగాహన సదస్సు గురువారం రుడా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సదస్సు రుడా వైస్-చైర్ పర్సన్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు వారి ఆదేశాల ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీ.వి.ఎస్.ఎన్. మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్లు యన్. శ్రీనివాస్ తదితరులు అనధికార లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకంలోని అర్హతలు, అవసరమైన పత్రాలు, రాయితీలు, …
Read More »కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించింది
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తమ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని చాలా పారదర్శకంగా నిర్వహించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించామని, ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్య రంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో …
Read More »పట్టాదార్ ఫోటో అప్‌లోడింగ్ పనులను పరిశీలన
రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్.కృష్ణ నాయక్ రంగంపేట తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న పట్టాదార్ ఫోటో అప్‌లోడింగ్ పనులను పరిశీలించారు. అనంతరం డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ, నిత్యావసర సరుకులు పంపిణీ పై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో మానిటరింగ్‌ను పెంచి, పౌరుల సంతృప్తిని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తించాలని ఆర్.కృష్ణ నాయక్ ఆదేశించారు. భూసమాచారం డిజిటలైజేషన్, అప్‌డేట్ చేయడం కోసం రెవిన్యూ శాఖ చేపడుతున్న ఈ ప్రక్రియను సజావుగా, సమయపాలనతో అమలు చేయాలని …
Read More »వయోజన విద్యా శాఖలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వయోజన విద్యా శాఖలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ కార్యాలయంలో 7 ఖాళీలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు కార్యాలయంలో 7 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అందులో రాజమహేంద్రవరం డివిజన్‌లో 2, కొవ్వూరు డివిజన్‌లో 2 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల ఉపాధ్యాయులు 30.08.2025 నుండి 05.09.2025 సాయంత్రం 5 గంటల లోగా సంబంధిత …
Read More »పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదు
– ఆలయాలకు మరింత శోభాయమానం రానుంది – రెండు వంతెనల వ్యూ పాయింట్ కి విఘాతం కలగదు – అఖండ గోదావరి ప్రాజెక్ట్ డిజైన్ తో ఎలాంటి నష్టం లేదు – పుష్కర్ ఘాట్ లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ వలన పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేసారు. అందుచేత …
Read More »ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలి
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రవరంలో పలుచోట్ల వినాయకులను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్ -వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -విఘ్నాలు తొలికి విజయాలు కలగాలని గణపతిని ప్రార్థించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదిదేవుడైన వినాయకుణ్ణి ప్రార్థించారు. గురువారం భాద్రపద మాసం శుద్ధ చవితిని పురస్కరించుకొని మంత్రి కందుల దుర్గేష్ పట్టవస్త్రాలను ధరించి …
Read More »అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు
-స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలులో స్వయంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించిన మంత్రి దుర్గేష్ -కార్డుల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలును నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన -కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ …
Read More »
Prajavartha Online Telugu News