Breaking News

కలక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన నివాళి

-చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంఘ సంస్కర్త , న్యాయనిపుణుడు, రాజకీయ నాయకుడు, మరియు మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా పనిచేసిన వలసవాద వ్యతిరేక జాతీయ వాది టంగుటూరి ప్రకాశం పంతులు మనందరికీ సదా స్మరణీయుడు అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సముపార్జన, బ్రిటిష్ వారికి ధైర్యంగా గుండె చూపుని ధీరోదాత్తుడు నుంచి నేటి యువత స్పూర్తి పొందాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజీనా అధికారి జి నరసింహులు, కలక్టరేట్ సూపరింటెంట్లు ఇతర జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *