సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబుకు కీర్తి పురస్కారం

-‘జనరంజక విజ్ఞానం’ ప్రక్రియలో నాగసూరి గౌరమ్మ సంజీవయ్య పురస్కారం ప్రదానం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు ప్రతిష్ఠాత్మక కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో ‘జనరంజక విజ్ఞానం’ ప్రక్రియలో నాగసూరి గౌరమ్మ సంజీవయ్య పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు టీఎస్ ప్రకాష్, అమరయ్య, నిమ్మరాజు చలపతిరావు, అక్బర్ పాషా, జ్యోతి శ్రీ, పరందామరాజు, ఉప్పలపాటి శ్రీనివాసమూర్తి తదితరులు పంతంగి రాంబాబును ఘనంగా సత్కరించి అభినందించారు.
జర్నలిజం రంగంలో ఆయన అందించిన సేవలను, ప్రజలకు విజ్ఞానాన్ని సరళంగా, ఆసక్తికరంగా అందించడంలో చేసిన కృషిని సహచరులు కొనియాడారు. పంతంగి రాంబాబు ఈ పురస్కారం అందుకోవడం పట్ల జర్నలిస్టు మిత్రులు, సహచరులు హర్షం వ్యక్తం చేశారు.