మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గృహాల నుండి పొడి తడి చెత్తను వేరువేరుగా సేకరించాలని జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో గురువారం ఉదయం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్రలో బాగంగా తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వని యజమానులపై అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడ వద్దన్నారు. ప్రజలు కూడా వేరువేరుగా చెత్తను స్వచ్ఛ రీక్షలకు అందించాలన్నారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది సేకరించిన చెత్తను కుప్పగా పోసి తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలో ప్రత్యక్షంగా చూపించారు. భూమిలో కలిసిపోయే కూరగాయల వ్యర్ధాలు, పండ్ల తొక్కలు, కుళ్ళిన పండ్లు, ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలను ఒక బుట్టలో వేయాలని, తిరిగి వినియోగించుకునేందుకు ఉపయోగపడే కాగితాలు, అట్టలు గాజు, ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, ఇనుప ముక్కలు మరో బట్టలో వేయాలని తెలపాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి రెండు బుట్టల్లో అందించాలని శానిటేషన్ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. తడి చెత్తను స్థానికంగా ఉండే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కు తరలించి వర్మి కంపోస్ట్ తయారీ, అమ్మ కాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.