Breaking News

Daily Archives: March 10, 2025

అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు .భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) ప్రొగ్రాం లో భాగంగా కోలిండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు.. శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు మహిళలకు సోమవారం …

Read More »

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వీధిలోని 114,115, వార్డు సచివాలయాలను కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బ్రాహ్మణ వీధిలోని సచివాలయాలను సందర్శించారు. సచివాలయ ఉద్యోగుల పనితీరును ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు. పశ్చిమ లోని గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా మార్చడానికి 22 డివిజన్ల లో 22 సచివాలయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిశీలించి సిబ్బంది …

Read More »

ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం

-50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం -మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది -కమ్యునికేషన్‌కు మాత్రమే ఇంగ్లీష్ భాష అవసరం -నోరి దత్రాత్రేయుడుని క్యాన్సర్‌ వ్యాధిపై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటాం -క్యాన్సర్‌ నివారణకు దత్తాత్రేయుడు సుధీర్ఘ సేవలందించారు..ఆయన తెలుగువారిగా పుట్టడం గర్వకారణం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథావిష్కరణలో పాల్గొన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మనం తీసుకునే ఆహారమే మెడిసిన్…వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. …

Read More »

గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసే జీ.ఓ.జారీ

-రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీచేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గృహా నిర్మాణ శాఖ జి.ఓ.ఆర్టీ నెం.9, తే.10.03.2025 దీ సోమవారం జారీ చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, …

Read More »

జాతీయ యువజనోత్సవాల్లో పి.బి. సిద్ధార్థ జయకేతనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయస్థాయిలో అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పోటీపడ్డ ఆరు అంశాల్లోనూ గెలుపొంది 6వ సారి ఓవరాల్ ఛాంపియన్షిప్ తో విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాల విజయకేతనం ఎగరవేసింది. సోమవారం ఉదయం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నోయిడాలోని ఎమిటీ వర్సిటీలో మార్చి 3-7 తేదీల్లో నిర్వహించిన క్లాసికల్ వోకల్, ఇండియన్ గ్రూప్ సాంగ్, మెహందీ అంశాల్లో పి.బి. …

Read More »

తపాలా శాఖ సంస్కరణలతో తలబాదుకుంటున్న ప్రజానీకం!

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక లావాదేవీల్లో ప్రపంచ వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, ప్రైవేటు బ్యాంకులు ఒకవైపు తీవ్రంగా పోటీ పడుతుండగా.. తపాలా శాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించిన బ్యాంకింగ్ సేవలు రోజురోజుకూ కునారిల్లిపోతున్నాయి. సరైన సేవలు అందక గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజానీకం ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ‘ఇదేం ఖర్మరా బాబూ’.. అంటూ తలలు బాదుకుంటున్నారు. తపాలా శాఖలో గత ఆరు మాసాలుగా తీసుకొస్తున్న సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజానీకం బేజారెత్తిపోతున్నారు. తపాలా శాఖ కొత్త చట్టం రావడం రావడమే …

Read More »

మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధానిలో గ‌తంలో భూములు పొందిన 13 సంస్థ‌ల‌కు ఆయా కేటాయింపులు ర‌ద్దు చేస్తూ మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంది..వివిధ కారణాల‌తో కేటాయింపులు ర‌ద్దున‌కు సబ్ క‌మిటీ ఆమోద ముద్ర వేసింది. అమ‌రావ‌తిలో సంస్థ‌ల‌కు భూముల కేటాయింపుల‌కు సంబంధించి మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం స‌చివాల‌యంలో జ‌రిగింది…రెండో బ్లాక్ లోని మొద‌టి అంస్థులో జ‌రిగిన ఈ స‌మావేశానికి మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌,ప‌య్యావుల కేశవ్,కందుల దుర్గేష్,కొల్లు రవీంద్ర‌,టీజీ భ‌ర‌త్ తో పాటు మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్,సీఆర్డీఏ క‌మీష‌న‌ర్ …

Read More »

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి… గ్రాట్యూట్ అమలుచెయ్యాలి…

-మినీ సెంటర్లన మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఓ అవ్వాలని డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. గ్రాట్యూటి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఓలుఇవ్వాలి. సంక్షేమపథకాలను అమలు, ఇతర సమస్యల పరిష్కారంకోసం సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్ టియు అంగన్వాడీసంఘాల ఆధ్వర్యంలో మార్చి 10వ తేది విజయవాడ అలంకార్ సెంటర్లో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో 27 జిల్లాల నుండి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం, అధికారుల ఒత్తిడిని తట్టుకొని వేలాదిగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, …

Read More »

బీసీలే అభివృద్ధే చంద్రబాబు శ్వాస… అభిలాష

-అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బడ్జెట్ లో బీసీలకు అత్యధిక నిధుల కేటాయింపు -బీసీలకు టీడీపీతోనే రాజకీయ ప్రాధాన్యం -త్వరలో ఆర్యవైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి కో ఆపరేటి క్రెడిట్ సొసైటీల ఏర్పాటు -హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం -బీసీలను మోసగించిన జగన్ -3 ఎమ్మెల్సీ పదవులు బడుగులకే కేటాయింపుపై మంత్రి సవిత హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలే శ్వాస… వారి సంక్షేమమే ధ్యాస… వారి అభివృద్ధే ఆశ… ఇదే చంద్రబాబునాయుడు గారి అభిలాష అని …

Read More »

చిన్నపిల్లల వైద్యం కోసం పికాబూ క్లినిక్ యాప్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల కోసం, వారికి ఏర్పడే ఆరోగ్య ఇబ్బందులకు సంబంధించిన విషయాలను రూపొందిస్తూ పీకాబు చిల్డ్రన్ క్లినిక్ ( Peekaboo childrens clinic) వారు ఉచిత యాప్ ను రూపొందించడం జరిగింది. సోమవారం సాయంత్రం నిర్మలా కాన్వెంట్ రోడ్ లోని నిర్మల కాన్వెంట్ ఎదురుగా ఉన్న పికాబు చిల్డ్రన్స్ క్లినిక్స్ డాక్టర్ గౌతమి అడిసుమిల్లి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను శాసనసభ్యులు గద్దె రామమోహన్, యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్ర హాస్పటల్ ఎండి …

Read More »