-టీడీపీ, జనసేన, బీజేపీ శాశ్వతంగా ఐక్యంగా ఉండాలి…మూడు పార్టీలు సమిష్టిగా ఉంటే మరో పార్టీకి అవకాశం రాదు -రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..అందులో అనుమానం అవసరం లేదు. -వైసీపీతో లాలూచీ ఆ పార్టీ నేతలను కూటమి నేతలు దగ్గరకు రానివ్వొద్దు -కార్యకర్తలు, పార్టీ కోసం పని చేయని వాళ్లు పార్టీకి అవసరం లేదు -సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు -తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు…రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే నా కల …
Read More »Daily Archives: March 4, 2025
నెలలో కనీసం రెండు సార్లు ఆర్థిక కమిటీలు సమావేశం కావాలి
-రాష్ట్ర శాసన సభా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసన సభా ఆర్థిక కమిటీలు నెలలో కనీసం రెండు సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. మంగళవారం రాష్ట్ర శాసన సభా భవనంలో శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) ల ప్రాథమిక సమావేశం ఆయన అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా స్పీకర్ …
Read More »భీమసింగి సుగర్స్ కార్మికులకి ప్రభుత్వం అండగా ఉంటుంది… : మంత్రి కొండపల్లి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చిన్న, సూక్ష్మ,విదేశీ వ్యవహారాల, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మంగళవారం లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి,సుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల నేతల తో సచివాలయంలో మంత్రి కార్యాలయంలో సమావేశమై రైతుల,ఉద్యోగుల సమస్యల తో పాటు వారికి అందవలసిన పీఎఫ్,గ్రాట్యుటీ కోసం చర్చించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏటికొప్పాక, …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
-రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బి.సి.వెల్పేర్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవితతో కలసి ఆమె …
Read More »రంజాన్ మాసంలో ఉర్దూ పాఠశాలల పనివేళలు మార్పు
-ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు -ఈ నెల 30 తేదీ వరకు అనుమతి -సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలలకు పని వేళల మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ …
Read More »ఏపీని గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు
-జర్మనీలో మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐ లు, జనసైనికులు, వీరమహిళలు -ఐటీబీ-2025 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జర్మనీలోని భారత రాయబారి హెచ్.ఈ అజిత్ గుప్తే -బెర్లిన్ మేయర్ కయ్ వేగ్నర్ ని సత్కరించిన మంత్రి కందుల దుర్గేష్, ఏపీ టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు వేస్తున్నారు. …
Read More »స్వచ్చభారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్చాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం… : మంత్రి నారాయణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చభారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్చాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి నారాయణ. 2047 నాటికి జీరో వేస్ట్ వాతావరణంలో నివసించేలా అవసరమైన లక్ష్యాలను పెట్టుకున్నామన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ రీజినల్ త్రీ ఆర్ సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు…మంత్రి తో పాటు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్,మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్,స్వచ్చాంద్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి …
Read More »మూడేళ్లలో సమగ్రంగా భూముల రీ సర్వే పూర్తి
-ప్రస్తుతం మండలానికో గ్రామంలో రీ సర్వే -గత ప్రభుత్వంలో బొమ్మలు వేసుకోవాలనే పిచ్చితో తప్పులతడకగా రీసర్వే -6688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం -2.79 లక్షల ఫిర్యాదుల స్వీకరణ -90 శాతం ఫిర్యాదుల పరిష్కారం -శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో తప్పుల తడకగా సాగిన భూముల రీ సర్వేను సరిదిద్దుతున్నామని, తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీ సర్వేలో ఎలాంటి తప్పులకు అస్కారం లేకుండా చాలా పకడ్బందీగా కొనసాగిస్తున్నామని రాష్ర్ట రెవెన్యూ, …
Read More »యాదవులకు ప్రాతినిద్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవులకు ప్రాతినిద్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కృష్ణాజిల్లా గొర్రెలు, మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం చైర్మన్ దిద్దుకూరి వెంకట కృష్ణారావు, వైస్ చైర్మన్ గొర్రెపర్తి సుబ్బారావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణ యాదవ్ కి ఎమ్మెల్సీ పదవి కేటాయించడం ద్వారా తమకు ఎంతో సహకారంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో చైర్మన్ దిద్దుకూరు వెంకట కృష్ణారావు, …
Read More »యూత్ పార్లమెంట్ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలను గుంటూరులోని టి జె పి యస్ కళాశాల లో నిర్వహించడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూత్ పార్లమెంట్ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.భారతదేశ అభివృద్ధి లో యువత బాగస్వామ్యం కావాలని, యువత మేధాశక్తి ని ఉపయోగించి ప్రపంచం లో కెల్లా మన దేశాన్ని …
Read More »
Prajavartha Online Telugu News