Breaking News

Daily Archives: March 23, 2025

మోకాలి నొప్పులకు ఆక్యుప్రెజర్ చికిత్స

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పడమట శ్రీ సచ్చిదానంద దత్త ఆశ్రమం నందు అదివారం మోకాళ్ల నొప్పులకు ఆక్యుప్రెజర్ చికిత్స శిబిరం డాక్టర్ మాకాల సత్యనారాయణ పర్యవేక్షణలో చికిత్స కార్యక్రమాలను పలువురికి అందించడం జరిగింది. ఎలాంటి మందులు వాడకుండా, మూల సమస్య నిర్ధారణ చేసి, ఆహారంలో మార్పులు చేస్తూ మానవ దేహంలో ఉన్న ప్రాణశక్తి కేంద్రాలను చైతన్యపరిచి,నొప్పులను గణనీయంగా తగ్గించి, వాళ్ళంతట వాళ్లే ఇకముందు సమస్య రాకుండా చికిత్స చేసుకునే విధానాన్ని పలువురికి అలవాటు చేసినట్లు విజయవాడ అశోక్ నగర్ లోని …

Read More »

నార్నే రంగారావు జ్ఞాపకార్థం అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం

-హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు నాయుడుకు చెక్కును అందించిన రంగారావు కుటుంబ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు గారి జ్ఞాపకార్థం… ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు నార్నే ‘అన్న క్యాంటీన్’కు రూ.1,00,01,016 విరాళంగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ‘అన్న క్యాంటీన్’ తిరిగి ప్రారంభించిన సమయంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తనకు స్ఫూర్తి నింపారని డాక్టర్ …

Read More »

పంటనష్టం కారణంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం చంద్రబాబు ఆరా

-జిల్లా అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచన -అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టంపై సీఎం సమీక్ష -1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని వివరించిన అధికారులు -నష్టపోయిన రైతులు సాయం అందించాలని అధికారులకు సీఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర్ పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 …

Read More »

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ… : రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీమ్ బేగ్ ఆధ్వర్యంలో మచిలీపట్నం లోని ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీదు నందు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు, ముందుగా ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ …

Read More »

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌

-ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్‌ ఫారూఖ్ నగర్ లోని జామె మస్ జిద్ అహ్లెహాదీ స్ ఫారూఖియా లో ఇఫ్తార్‌ విందు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఇఫ్తార్‌ విందుకు హజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ముస్లింల పవిత్రమైన గ్రంధం ఖురాన్‌ అవతరించింది ఈ రంజాన్‌ మాసంలోనేని అన్నారు. …

Read More »

ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యం

-నిరుపేద కుటుంబానికి చెందిన వారికి తోపుడు బండి, ఇస్త్రీ పెట్టె, కుట్టుమిషన్‌ అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అందుకోసమే ప్రతి కుటుంబం నెలకు రూ.15 వేలు సంపాదించుకునేలా చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కు చెందిన …

Read More »

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసి ప్రాధమిక దశలోనే వ్యాధులను గుర్తించి నాణ్యమైన వైద్యసేవలను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ, వైద్యావిద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి కార్డియాక్ మరియు కార్డియోథెరసిక్ విభాగంలో 100 సీఏబీజీఎస్ ప్రోసిజర్లు, 25000 క్యాథ్లాబ్ ప్రోసిజర్లు, 5000 పీటీసీఏ లు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రాష్ట్ర సచివాలయం సమీపంలో 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు, దాతలు, ప్రభుత్వం, భాగస్వామ్యం (పీ4) కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచనలు చేశారు. అంతకుముందు రాష్ట్ర సచివాలయంలో మార్చి, …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

-ఈ సోమవారం (24-3-2025)) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …

Read More »