Breaking News

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌

-ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్‌ ఫారూఖ్ నగర్ లోని జామె మస్ జిద్ అహ్లెహాదీ స్ ఫారూఖియా లో ఇఫ్తార్‌ విందు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఇఫ్తార్‌ విందుకు హజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ముస్లింల పవిత్రమైన గ్రంధం ఖురాన్‌ అవతరించింది ఈ రంజాన్‌ మాసంలోనేని అన్నారు. ఈ రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేసి రంజాన్‌ పండుగ రోజున భక్తీతో నమాజులు, పేదలకు సహాయం చేయడం చేస్తుంటారన్నారు. మనుషుల మధ్య ఉన్న వర్గ వైషమ్యాలను తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతనలు కలిగిస్తూ మంచి జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్య కార్యాల వైపునకు మన దృష్టిని మరల్చేదే రంజాన్‌ పర్యదినం అని అన్నారు. ఈ పండుగకు పేద, ధనికులు అనే తేడా లేకుండా అత్యంత భక్తీతో అందరూ కలిసి జరుపుకుంటారని చెప్పారు. రంజాన్‌ పండుగకు ముందుగా నిర్వహించే ఇలాంటి ఇప్తార్ విందుల వల్ల అందరిలో ఆత్మీయత సృహృద్భావ వాతావరణం పటిష్టమవుతాయని చెప్పారు. పరస్పర సహాయం చేసుకునే ఆలోచనతో పాటుగా విశాలమైన ఆలోచనలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. తోటి వారికి సహాయం చేయడం, మనకు ఉన్నదాంట్లోనే కొంచెం దానం చేయడం వంటి మంచి పనులకు ముస్లిం సోదరులను చూసి నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్తార్‌ విందులో నజీర్ అహ్మాద్ , ఎం.డి ఖాలిక్, అబ్దుల్ కరీం, హతవుల్లా , అబ్దుల్ వాహిద్ , తాజుద్దీన్, మరియు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *