Breaking News

మోకాలి నొప్పులకు ఆక్యుప్రెజర్ చికిత్స

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పడమట శ్రీ సచ్చిదానంద దత్త ఆశ్రమం నందు అదివారం మోకాళ్ల నొప్పులకు ఆక్యుప్రెజర్ చికిత్స శిబిరం డాక్టర్ మాకాల సత్యనారాయణ పర్యవేక్షణలో చికిత్స కార్యక్రమాలను పలువురికి అందించడం జరిగింది. ఎలాంటి మందులు వాడకుండా, మూల సమస్య నిర్ధారణ చేసి, ఆహారంలో మార్పులు చేస్తూ మానవ దేహంలో ఉన్న ప్రాణశక్తి కేంద్రాలను చైతన్యపరిచి,నొప్పులను గణనీయంగా తగ్గించి, వాళ్ళంతట వాళ్లే ఇకముందు సమస్య రాకుండా చికిత్స చేసుకునే విధానాన్ని పలువురికి అలవాటు చేసినట్లు విజయవాడ అశోక్ నగర్ లోని యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం మేనేజర్, యు డి ప్రసాద్  మరియు కే బాబురావు  ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *