Breaking News

క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (World T.B day) సందర్భంగా సోమవారం కొత్త గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ర్యాలీ మరియు ప్రజలకు క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమం చేపట్టారు. Professor Dr Sudheena మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, కళ్ళె పడటం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రతి ఒక్కరు తెమడ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. Associate professor Dr Aruna మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కళ్ళె పరీక్షలు మరియు మందులు పూర్తిగా ఉచితం అని తెలియజేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిఏటా 6000 మందికి కళ్ళె పరీక్షలు జరుగుతున్నాయని మరియు దాదాపు 1200 మందికి టి.బి నిర్ధారణ చేస్తున్నట్లు తెలియజేశారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ళె పరీక్షలు CBNAAT Machine ద్వారా రెండు గంటలలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని చెప్పారు. మందులు వాడుతున్న సమయంలో పోషకాహార నిమిత్తం కోసం ప్రభుత్వం ప్రతి నెల 1000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తుందని తెలియజేశారు. టి.బి వ్యాధిగ్రస్తులకి టి.బి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా పోషకాహార నిమిత్తం కొరకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టి.బి రహిత భారతదేశం కొరకు సమాజం కూడా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో Department of pulmonary medicine నుండి Dr Sudheena, Dr Aruna మరియు Dr Sirisha మరియు NTEP, NACO సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *