Breaking News

చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి దృష్ట్యా కోనేరు సెంటర్లో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల దప్పిక తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *