విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 5వ డివిజన్ అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నా మస్జిద్ ఉమర్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ షరీఫ్ ఏర్పాటు చేసిన 100 కిట్లను గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం అందజేశారు. ఒకొక్క కిట్టు రూ. 800 విలువ చేసేవి 100 మందికి పంపిణి చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేద …
Read More »Daily Archives: March 30, 2025
ఉగాది (యుగాది)
-” విశ్వావసు” “ఉగాది’ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం..అందరికి శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేదనల క్రోధి సంవత్సరం కనుమరుగు కాగా.. వడివడిగా వెలుగుల “విశ్వావసు” శుభముగ రాగా.. వేపపూత రెపరెపల “విశ్వావసు” వైభవం.. ప్రతి సంవత్సరం చైత్ర శుద్దపాడ్యమికి వస్తుంది. వండకుండ సాంప్రదాయ బద్దంగా చేసుకునే షడ్రుచుల తో కూడిన ఉగాది పచ్చడి చేస్తారు.. అణగారిన బ్రతుకులలో ఆనందం నింపే వరప్రదాయిని ఉగాది పర్వదినం.. గత కాలంలో బాధలను,కన్నీటి గాధలను సమాధిచేసే షడ్రుచుల సమాహారమే ఉగాది.. ఉగాది అంటే షడ్రుచుల కలబోతే _ ఆరు …
Read More »పేదరికం లేని సమాజమే నా జీవితాశయం
-గత ప్రభుత్వంలో అందరికీ అవమానాలే… ఇక వచ్చే ఐదేళ్లూ అందరికీ రాజపూజ్యం -ఈ ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలి -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం -వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కళారత్న, ఉగాది అవార్డుల ప్రదానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని అందులో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ …
Read More »పేదరికం లేని సమాజం కోసమే పీ-4 కార్యక్రమం
-పథకం కోసం 30 లక్షల కుటుంబాలు గ్రామ సభలు ద్వారా ఎంపిక -గత ప్రభుత్వం వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే… -మేము ప్రజల ఎదుగుదల కోసం సహకరించమని అడుగుతాం -అమరావతిలో నిర్వహించిన పీ-4 పథకం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే పీ-4 కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీరో పేదరికం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం “జీరో పావర్టీ పీ-4 …
Read More »ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో మహానాడు రోడ్డులో ఉండే ఎస్సీఈఆర్టీ కార్యాలయం ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతన భవనంలోకి మార్చినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుండి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (SCERT), డోర్ . నం. 398/3, శ్రీ నిలయం, ముసునూరి డెవలపర్స్, విద్యాభవన్ పక్కన, ఆత్మకూరు, మంగళగిరి(M), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.-522503 చిరునామాలో సేవలందిస్తోందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.
Read More »వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రతి ఒక్కరిని గుర్తించి సన్మానించడం చాలా మంచి విషయం… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఉగాది పురస్కార సత్కారాలు, పంచాంగ శ్రవణం మరియు శ్రీ నగరాల సంఘంనూతన సభ్యుల పరిచయ కార్యక్రమంనకు సభాధ్యక్షులుగా శ్రీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు సభా ప్రారంభకులుగా నగరాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని సూర్యారావు ముఖ్య అతిథులుగా ysrcp నాయకులు పోతిన వెంకట మహేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం, పైలా సోమి నాయుడు, …
Read More »ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యాన్ని పెంపొందించి ఐక్యతను చాటే పర్వదినం పవిత్ర రంజాన్ అని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిసోదరులు అందరికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ అల్లాహ్ కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆ అల్లా అనుగ్రహించలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు …
Read More »ఘనంగా ఆర్ ఎస్ ఎస్ ఉగాది ఉత్సవాలు..
-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ ఎస్ ఎస్ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయవాడ, మహానగర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొని ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ …
Read More »బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం
-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వా వసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. మార్తి శివరామకృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేసిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అంకితభావంతో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు సూపరింటెండెంట్ లక్ష్మణరావు, ఏఈఓ చంద్రశేఖర్ సుజనా కు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం పొందారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని , అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. సుజనా వెంట బీజేపీ నాయకులు మిట్టా వంశీ, అడ్డూరి శ్రీరామ్ , కొత్తపల్లి సుబ్బారాయుడు, చైతన్య శర్మ, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, …
Read More »
Prajavartha Online Telugu News