Breaking News

Daily Archives: March 7, 2025

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

-ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు -సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు… ఏఐలోనూ రాణించాలి -మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. న్యూ జెనరేషన్ – టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ – ప్రోస్పెరిటీ ఫర్ ఆల్” అనే అంశంపై విజయవాడలోని నోవోటెల్ హోటల్ జరిగిన అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి …

Read More »

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం

-ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు -రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఎపి ప్రభుత్వంతో ఒక అవగాహన …

Read More »

FEMMI ద్వారా మైనర్ మినరల్ మైనింగ్‌లో అవకాశాలు మరియు సవాళ్లపై జాతీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని మైనర్ మినరల్ రంగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి ఒక మైలురాయి ప్రయత్నంలో భాగంగా, FEMMI, NITI ఆయోగ్ మరియు గనుల మంత్రిత్వ శాఖతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో మైనర్ మినరల్ మైనింగ్‌లో అవకాశాలు మరియు సవాళ్లపై జాతీయ సమావేశాన్ని నిర్వహించింది . ఈ కార్యక్రమం కీలకమైన విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు మరియు వాటాదారులను ఒకచోట చేర్చి కీలకమైన సంస్కరణలను చర్చించడానికి మరియు ఈ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి ఒక …

Read More »

చేనేత రంగాన్ని వారసత్వంగా చేసుకుంటూ చేనేత భవిష్యత్తు బలోపేతం చేయాలి…

-క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో చేనేత రంగాన్ని వారసత్వంగా చేసుకుంటూ చేనేత భవిష్యత్తు బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరి సహకారం అందించాలని ‘‘క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా శుక్రవారం బందరురోడ్డులోని కనకవల్లి షోరూమ్‌లో ‘‘టేకింగ్‌ స్టాక్‌’’ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇందుకోసం చేనేతరంగం అంటే మక్కువ చూపే సందర్శకులను, రిటైలర్లు, డిజైనర్లు, కార్యకర్తలు, చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని క్రాప్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సిసిఏపి) …

Read More »

మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ

-మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్ -త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు(శనివారం)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు …

Read More »

వైద్య‌, ఆరోగ్య శాఖ‌కు రూ.19,264 కోట్లు

-రూ.250 కోట్ల‌తో గిరిజ‌న ప్రాంతాల్లో 5 మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రులు -గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల కన్నా దాదాపు 30 శాతం అధికం -69 లక్షల మంది విద్యార్ధులకు హెల్త్ రికార్డుల ఏర్పాటు -ఆశా వర్కర్లకు అన్ని రాష్ట్రాలకన్నా అత్యధిక వేతనం, గ్రాట్యుటీ -108 సేవల మెరుగుకు చర్యలు -అందుబాటు ధరలకు మందుల లభ్యత కోసం మండలానికో జనఔషధీ కేంద్రం -ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లకు సొంత భవనాలు -అసెంబ్లీలో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన …

Read More »

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్‌గానే అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ధర్నాచౌక్‌ వద్ద వర్గీకరణపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొవాలని నిరసన సభ నిర్వహించారు. దీనికి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్‌ మాదిగ అధ్యక్షత వహించారు. ప్రధాన వ్యక్తగా విచ్చేసిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో …

Read More »

న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఎద‌గాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గోల్డ్ వ‌ర్క్ షాప్ ప్రారంభించిన ఎంపి కేశినేని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు. న‌గ‌రంలోని యువ‌కులంద‌రూ ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని శివాల‌యం స్ట్రీట్ జెండా సందులో ఎస్.ఆర్.పి గోల్డ్ వ‌ర్క్స్ షాపు ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కు షాప్ యాజ‌మాని సాయిరాజ్ పాటిల్ తో పాటు టిడిపి నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బొండా …

Read More »

సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2024–25 సంవత్సరము ఆస్తి పన్ను మరియు బకాయిలను చెల్లించుటకు మరో 3 వారాలు మాత్రమే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా రెండవ శని మరియు ఆదివారాలు శెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల …

Read More »

అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద లైట్లు, ట్యాప్ లు సక్రమంగా ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా …

Read More »