Breaking News

సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2024–25 సంవత్సరము ఆస్తి పన్ను మరియు బకాయిలను చెల్లించుటకు మరో 3 వారాలు మాత్రమే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా రెండవ శని మరియు ఆదివారాలు శెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ యధావిధిగా ఉంటుందన్నారు. పన్నులు చెల్లింపునకు కేవలం 3 వారాలే మాత్రమె గడువు ఉన్నందున ఈ నెల 8 మరియు 9 శెలవు రోజులైన రెండవ శనివారం , ఆదివారాల్లోను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్ల యందు నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్ను చెల్లించని మొండి బకాయిదార్లకు ఆస్తుల సీజ్ కు చేయడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *