-విజయవాడలోని నోవా టెల్ హోటల్ లో మారిటైం, లాజిస్టిక్స్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పై ఆంధ్ర ప్రదేశ్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ తో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. -మారిటైమ్ – లాజిస్టిక్స్ రంగాల్లో రాష్ట్రం యొక్క సామర్థ్యం మరింత మెరుగుపడేలా భాగస్వామ్య పక్షాలతో చర్చలు ఉపయోగకరం… -పోర్టుల అభివృద్ధిలో లాజిస్టిక్స్ రంగం చాలా కీలకమైనది.. -2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు కృషి చేస్తున్నాం.. -ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ …
Read More »Daily Archives: March 4, 2025
ఈనెల 7 నాటికి పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ పూర్తికావాలి
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలని.. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ – పీఏసీలు (e-PACS)గా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్లైన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో …
Read More »అత్యంత పారదర్శకంగా రీసర్వే పనులు
– కార్యకలాపాల్లో పురోగతిపై నిరంతర పర్యవేక్షణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భూ యజమానుల సమక్షంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రీసర్వే పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ వీరులపాడు మండలం, గోకరాజుపల్లిలో రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామంలో రీసర్వే ప్రగతి రికార్డులను పరిశీలించి.. లక్ష్యాల మేరకు కార్యకలాపాలు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ పరిధిలోని భూ వివరాలను పరిశీలించి.. మ్యాప్‌లను, గ్రౌండ్ ట్రూతింగ్‌ను పరిశీలించారు. …
Read More »వేసవిలో తాగునీటిపై ఒక్క ఫిర్యాదూ రాకూడదు..
– ఈ నెల 15 నాటికి 100 శాతం సరఫరా పథకాలూ క్రియాశీలం కావాలి – ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి – పశుపక్ష్యాదులకూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని, ఈ నెల 15 నాటికి 100 శాతం తాగునీటి సరఫరా పథకాలూ క్రియాశీలం కావాలని కలెక్టర్ డా. …
Read More »ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో భాగస్వాములమవుదాం
– సహజ సాగు పద్ధతులతోనే మానవ మనుగడకు ఊపిరి – ప్రకృతి సాగు ఓ సత్యం.. అందుకే అది తప్పక జయిస్తుంది.. – దశల వారీగా ప్రకృతి సేద్యంలో జిల్లాను నెం.1గా నిలుపుదాం – సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ రైతులకు అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని.. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1లో నిలిపేందుకు సమష్టి …
Read More »జీవితంలో క్రీడలు భాగం కావాలి…
-క్రీడలతో మహిళల్లో మరింత మానసిక చైతన్యం… -క్రీడలపై ఆసక్తి పెరగడం శుభ పరిణామం… -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైనందిన జీవితంలో ప్రతి ఒక్క మహిళ క్రీడల పట్ల ఆసక్తి చూపడం సమాజంలో ఆరోగ్య అవగాహన పట్ల వస్తున్న మార్పునకు శుభ పరిణామమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ …
Read More »మానసికోల్లాసంతో…శారీరక దృఢత్వం…
-జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలి… -మహిళా ఉద్యోగులకు అండగా ఉంటాం… -కూటమి ప్రభుత్వంలో…ఉద్యోగులు భద్రం… -మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను ప్రారంభించిన మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది పొడవునా అలుపు లేకుండా కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినుల మానసిక సాంత్వన కోసం, శారీరక దృఢత్వం కోసం ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో అవసరమని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖల మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం …
Read More »ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీ లెక్కింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, మల్లేశ్వర మహా మండపం 6 వ అంతస్తులో మంగళవారం నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్బంగా 26 రోజులకు గానూ రూ.04,07,39,829/-(అక్షరాలా నాలుగు కోట్ల, ఏడు లక్షల, ముప్పై తొమ్మిది వేల, ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు )నగదు రూపంలో, 700గ్రాముల బంగారం, 6550 గ్రాముల వెండి రూపంలో లభించాయి. ఆన్ లైన్ ద్వారా భక్తులు ఈ – హుండీ(e-hundi)లో తేదీ. 06-02-2025 …
Read More »కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సుజనా చౌదరి హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యే సుజనా మంగళవారం శాసనసభలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి, అత్యధిక మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమం కోసం రూ 38,605 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం రూ 47,456 …
Read More »ఎపి కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పో అండ్ కాన్‌క్లేవ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో ఎపి కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పో అండ్ కాన్ క్లేవ్ ప్రారంభం అయింది. మంగళవారం విజయవాడ ఎంజి రోడ్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు ఎస్.కె.బాజీ మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్, మెటీరియల్స్ విక్రయించే సంస్థలు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో, రాష్ట్రాభివృద్ధిలో భవన నిర్మాణ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన …
Read More »
Prajavartha Online Telugu News