విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో ఎపి కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పో అండ్ కాన్ క్లేవ్ ప్రారంభం అయింది. మంగళవారం విజయవాడ ఎంజి రోడ్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు ఎస్.కె.బాజీ మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్, మెటీరియల్స్ విక్రయించే సంస్థలు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో, రాష్ట్రాభివృద్ధిలో భవన నిర్మాణ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటం, భవన నిర్మాణ రంగంలో వివిధ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది ఈ ఎక్స్‌పో ధ్యేయమన్నారు. మార్చి 5వ తేదీన ఉ.11 గం.లకు ‘కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్‌క్లేవ్’ పేరుతో ఒక సదస్సు, చర్చా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్డిఎ అధికారులు, నిర్మాణ రంగంలోని పలు సంఘాలు క్రెడాయ్, బిఎఐ, నేరెడ్కో, సిఎఫ్‌ఎ, సబ్‌కా, ఆర్కెటెర్స్ అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్ పాల్గొంటాయన్నారు. ఈ ఎక్స్‌పోలో ఎంపి, మంత్రులు, ఎమ్మెల్యే, రాజకీయ ప్రముఖులు, నగరప్రముఖులు, పలు భవన నిర్మాణ రంగ నిపుణులు, యంత్రాలు, పరికరాలు తయారు చేసే కంపెనీల ప్రతినిధులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే నిపుణ సంస్థల ప్రతినిధులు, పబ్లిక్, ప్రైవేటు రంగాలకు చెందిన ఆర్కిటెక్టు, ప్రాజెక్ట్ యజమానులు, ఇంజనీర్లు, కాంక్రీట్ టెక్నాలజిస్టులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, వక్త గోళ్ళ నారాయణరావు, రఫీ, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News