విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, మల్లేశ్వర మహా మండపం 6 వ అంతస్తులో మంగళవారం నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్బంగా 26 రోజులకు గానూ రూ.04,07,39,829/-(అక్షరాలా నాలుగు కోట్ల, ఏడు లక్షల, ముప్పై తొమ్మిది వేల, ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు )నగదు రూపంలో, 700గ్రాముల బంగారం, 6550 గ్రాముల వెండి రూపంలో లభించాయి. ఆన్ లైన్ ద్వారా భక్తులు ఈ – హుండీ(e-hundi)లో తేదీ. 06-02-2025 నుండి తేదీ. 03-03-2025 వరకు 26 రోజులకు గాను రూ.2,81,386/-కానుకలు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్, ఉప కార్యనిర్వహణాధికారి ఎం. రత్నరాజు హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు. దేవదాయ శాఖసిబ్బంది,వన్ టౌన్ పోలీసులు, ఎస్.పి.ఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమం లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News