-లారీ, మెకానిక్, ఐలా అసోసియేషన్స్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశం
-తాత్కాలిక రహదారుల ఏర్పాటుకి ఆదేశించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోనగర్ లోకి లారీ రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, రెండు మూడు నెలల్లో పలు మార్గాల్లో లారీలు ప్రవేశించే విధంగా రహదారులు సిద్దం చేసేందుకు ఏర్పాట్లు మొదలైనట్లు ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఆటోనగర్ నుంచి లారీలు వెళ్లే సమయంలో అటు లారీ ఓనర్స్, ఇటు ట్రాఫిక్ పోలీసుల అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లారీ, మెకానిక్, ఐలా అసోసియేషన్స్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. లారీలు ఆటోనగర్ నుంచి బయటికి రాకుండా ఉదయం, సాయంత్రం విధించిన సమయాలు సడలించాలని అసోసియేషన్ నాయకులు ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. ట్రాఫిక్ ఎ.డి.సి.పి ప్రసన్నకుమార్ తో మాట్లాడి కొంత సడలింపు ఇప్పించారు. అలాగే ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఆటోనగర్ లోని బల్లెం వారి వీధి నుంచి శక్తి కళ్యాణమండపం వైపు వెళ్లే రహదారిలో గుంతలు పూడ్చి…అందుబాటులో తీసుకువస్తే కొంత లారీల రాకపోకలకు వెసులు బాటు కల్పించినట్లు వుంటుందని ఎంపి కేశినేని శివనాథ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ జరిగిందంటూ…ఆ కాంట్రాక్టర్ కి పోన్ చేసి ముందుగా గుంతలు పూడ్చాలని ఆదేశించారు. నగరంలో మహానాడు జంక్షన్ నుంచి నిడమానురు వరకు ఫైఓవర్ పనులు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు మొదలైనా ఆటోనగర్ లోకి లారీ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి.ఐ రామారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగ మోతు రాజా, సెక్రటరీ అల్లాడ వీర వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ రావి శరత్ బాబు, వైస్ ప్రెసిడెంట్ కాజా సత్య వెంకట చలపతిరావు, టెలర్స్ అసోసియేషన్ సెక్రటరీ సురుపునేని సురేష్, ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖర రావు, ఆటో మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ (ఎ.టి.ఎ) మాజీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు లతోపాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.