-కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమని 49వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. ఎన్డీఏ కార్యాలయంలో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర ప్రమాదం జరిగిందన్నారు. పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, బిజెపి నాయకులు పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.