Breaking News

11వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం సద్వినియోగపరుచుకోవాలి

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య (ఒకేషనల్) అభ్యసిస్తున్న 11వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇంటర్న్ షిఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు పాఠశాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులను, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను, జీసీడీవోలను ఆదేశించారు. గత ఏడాది దసరా సెలవుల్లో దాదాపు 8 వేల మంది 10, 11,12 తరగతుల విద్యార్థులు ఇంటర్న్ షిప్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 10 ట్రేడుల్లో అందించే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగపరుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎడిబి 4 వరసల రహదారి పనుల పురోగతి పై క్షేత్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ

-గ్రామాల వారీగా పనుల పురోగతిని వివరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, రంగంపేట, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *