విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పి బి సిద్ధార్థ కళాశాల మైదానం లో జరుగుతున్న 68 వ స్కూల్ గేమ్స్ జాతీయ బాలికల వాలీ బాల్ పోటీల్లో తమిళనాడు,కర్నాటక జట్టు ఫైనల్స్ కు చేరుకున్నాయి .మొదటి.సెమీఫైనల్ పోటీలో తమిళనాడు హర్యానా పై 3-0 సెట్లతో వరుస విజయాలు సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది.25-14,25-12,25-16 స్కోర్ తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.తమిళనాడు జట్టులో సాధన, మౌనిహ,పవిత్ర లు అద్భుత మైన ఆల్ రౌండ్ ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయానికి కృషి చేశారు.సెట్టర్ నవనీత చాకచక్యం గా బంతులు వేసి జట్టును విజయతీరాలకు చేర్చింది.హోరాహోరీ గా జరిగిన రెండో సెమీ ఫైనల్స్ పోటీలో కర్నాటక 3-0 సెట్లతొ కేరళ పై గెలుపొంది ఫైనల్స్ కు చేరుకుంది.కర్నాటక క్రీడాకారిణి లు అద్భుతమైన డిఫెన్స్ ఆటతీరు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.కేరళ అటాకింగ్ లో రాణించినా కర్నాటక డిఫెన్స్ తో కట్టడి చేసింది.మొదటి రెండు సెట్ల ను కర్నాటక అలవోకగా గెలిచినా మూడో సెట్ గెలవడానికి చెమటోడ్చిoది.కర్నాటక 25-18,25-16,25–22 స్కోర్ తో ఘన విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. కర్నాక జట్టులో లీబ్రో అన్విత డిఫెన్స్ లోనూ అటాకింగ్ లో దిశ,హులిగమ్మ,ధృవి లో అద్భుతమైన ఆటతో జట్టుకు విజయాన్ని చేకూర్చారు.శుక్రవారం ఉదయం 8 గంటలకు హర్యానా,కేరళ జట్లమధ్య. తృతీయ స్థానం పోటీ 10 గంటలకు ,తమిళనాడు,కర్నాటక జట్ల మధ్య ఫైనల్స్ పోటీ జరుగుతుందని చీఫ్ రిఫరీ డి.దయాకర్ తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …