గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) లు ఉపయోగపడతాయని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఏటుకూరు రోడ్డులోని నగర పాలక సంస్థ కంపోస్ట్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యం.యల్.ఎ గల్లా మాధవి గారితో 6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలలో గుంటూరు కూడా ఒకటని, అటువంటి నగరాలకు జి.టి.యస్ ల అవసరం ఎంతైనా ఉందన్నారు. జి.టి.యస్ ల ప్రాధాన్యం మేరకు 15వ ఆర్ధిక సంఘం గుంటూరు నగరానికి 4 జి.టి.యస్ లను మంజూరు చేయగా, గతంలో వాటి నిర్మాణ పనులు జరగలేదని, ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి గారి చొరవతో జిల్లాలో మొదటి జి.టి.యస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. జి.గి.యస్ ల వలన తడి పొడి చెత్తలను వేరు చేయడంతో పాటు, తడి చెత్తతో బయోగ్యాస్ మరియు వర్మి క్మపోస్ట్ తయారు చేస్తారని, అలాగే పొడి చెత్తను జిందాల్ కు తరలించుట ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసి, వ్యర్ధాలను సమర్ధవంతంగా నిర్వహించుట జరుగుతుందన్నారు. ప్రస్తుతం నిర్మాణం జరిగే జి.టి.యస్ కు రోజుకు 120 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను ప్రాసెస్ చేసే సామర్ద్యం ఉందన్నారు. జి.టి.యస్ నిర్మాణ పనులు నాన్యతాప్రమాణాలతో జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షన చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా యం.యల్.ఎ మాట్లాడుతూ, స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్చాన్ధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, నగరంలో ఎక్కడా చేత పేరుకుపోకుండా చెత్త సమస్యకు పరిష్కారంగా పశ్చిమ నియోజకవర్గంలో జి.టి.యస్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గృహాల నుండి ఇక్కడకు వచ్చిన వ్యర్ధాలను తడి పొడి వ్యర్దాలుగా విభజించి ప్రాసెస్ చేయుట జరుగుతుంది. దీని వలన ఎవరికీ ఎటువంటి సమస్యలు రావని ఇప్పటికే ఈ జి.టి.యస్ లను వైజాగ్, విజయవాడ, తిరుపతి నగర పాలక సంస్థ ల యందు ఏర్పాటు చేశారన్నారు. స్వచ్చాన్ద్రప్రదేశ్, స్వచ్చ గుంటూరు లో భాగంగా గుంటూరు నగరానికి మెరుగైన ర్యాంకు రావడానికి ఈ జి.టి.యస్ లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 2 జి.టి.యస్ లను నిర్మించానున్నారని, ప్రస్తుతం శంకుస్తాపన చేసిన జి.టి.యస్ 4 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారని తెలిపారు.
సదరు కార్యక్రమంలో యస్.ఈ నాగామల్లెశ్వరరావు, సి.యం.హెచ్.ఓ డాక్టర్ పి.జె.అమృత, ఈ.ఈ సుందర రామి రెడ్డి, యం.హెచ్.ఓ రవిబాబు, రాషా ఇన్ఫ్రా ప్రతినిధులు అమర్ రెడ్డి, యస్.యస్ లు, ఎ.ఈ లు శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …