-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పశుపక్షాధులు, ప్రకృతితో అనుసంధానమైన రైతన్నల పండుగ. భోగిమంటల వెలుగులు, రంగవల్లులు, వేకువజామునే తలంటు స్నానాలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాల సందళ్లు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. ప్రతి పల్లె పాడిపంటలతో కళకళలాడుతూ.. రైతులు, గ్రామీణ వృత్తుల వారంతా సుఖసంతోషాలతో ఉండాలి. అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం అయ్యేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.