గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ, స్టెప్, స్వశక్తి, గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యములో ఆదివారం జిల్లా స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కాలేజ్, బ్రాడిపేట, గుంటూరు నందు డా.వి.కౌసల్య దేవి, ప్రిన్సిపాల్, బండ్లముడి హనుమయమ్మా మహిళా 20 కాలేజ్ వారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన టి.వి. విజయలక్ష్మీ, ముఖ్యకార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ, గుంటూరు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యువజన సర్వీసుల తన భవితకు తానే కారకుడని తెలియజేస్తూ చికాగో సదస్సులో అద్భుతమైన ప్రసంగాన్ని వివేకానంద స్వామి తెలియజేశారని స్వామి వివేకానంద భారతదేశంలోని ప్రజలందరి గురించి ముఖ్యంగా పేద వారి గురించి ఎంతో పరితపించే వారిని దేశ ప్రజల కోసం వివేకానంద మూడు రోజులు ధ్యానం చేశారని తెలియజేశారు.విశిష్ట అతిధిగా విచ్చేసిన డి. కిరణ్మయి, జిల్లా యూత్ ఇంచార్జ్, నెహ్రూ యువ కేంద్రం, గుంటూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద చిన్నతనం నుండే కులమతాలకు అతీతంగా దేశం గురించి ఆలోచించారని అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ మన అందరికీ ఆదర్శంగా నిలుస్తారని తెలియజేశారు. మరో అతిధిగా విచ్చేసిన ఏ.రాధ మాధవి, వైస్ ప్రిన్సిపాల్, బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కాలేజ్, గుంటూరు మాట్లాడుతూ యువత అందరూ బలమైన దృఢసంకల్పంతో జీవితంలో పైకి ఎదగాలని జీవన నైపుణ్యాలు పెంచుకోవాలి అని తెలియజేశారు. స్వామి వివేకానంద భారతదేశంలోని గొప్ప వ్యక్తులలో మొదటి వరుసలో ఉంటారు అని తెలియజేశారు. స్వామి వివేకనంద జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన వ్యాసరచన, వక్తృత్వం, డిబేట్, క్విజ్ లపై జరిగిన జిల్లా స్థాయి పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానము ముఖ్య అతిధిగా విచ్చేసిన టి.వి. విజయలక్ష్మీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ, గుంటూరు చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రములో తన్నీరు శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, యువజన సర్వీసుల శాఖ మరియు బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు & అధ్యాపకులు పాల్గొన్నారు.