మచిలీపట్నం,, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారన్నారు. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతలు, దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోపూజలతో మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందన్నారు. ప్రజలంతా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
Tags machilipatnam
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …