విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ కు చెందిన ఐబిఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టేషన్స్ కంపెనీ క్యాలెండర్ ను ఆదివారం మంగళగిరి ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండి వడ్లమూడి హర్షకి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్ కు వడ్లమూడి హర్ష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కొండలరావు, అంజనీ కుమార్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొతినేని శ్రీనివాస్ లతో పాటు స్థానిక ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …