కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర కమిటీ ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఆదివారం విజయవాడలోని స్థానిక యుటిఎఫ్ భవన్ లో గొర్ల మాణిక్యం అధ్యక్షతన నిర్వహించటం జరిగినది. ఈ సమావేశానికి కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ హాజరయ్యారు.ఈ సమావేశంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం నిర్మాణం, రెగ్యులరైజేషన్ తదితర అంశాలను చర్చించి, అనంతరం ఉన్నత విద్యా పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజగోపాల్ బాబు,ప్రజాశక్తి మాజీ సంపాదకులు వీ కృష్ణయ్య, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కేవీ నాగేశ్వరరావు ల ,పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగినది. ఈ ఎన్నికలో గౌరవ సలహాదారుగా కె శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులుగా కుమ్మరి కుంట సురేష్ ,ప్రధాన కార్యదర్శిగా గొర్ల మాణిక్యం ,కోశాధికారిగా కే రత్నకుమారి,సభ్యులుగా పి.ముద్దు బాబు (శ్రీకాకుళం) శ్యామ్ కిరణ్ (పశ్చిమగోదావరి) నాగేశ్వరరావు శేషగిరి రవిశంకర్ (కృష్ణాజిల్లా) బాలయ్య,సుధీర్,రాబర్ట్,రమేష్ బాబు (గుంటూరు) జాన్ బాబు, ఖాదర్ వలీ (ప్రకాశం) కల్లూరు శ్రీనివాస్,కాశిరత్నం (నెల్లూరు) లత, ఓబయ్య,కృష్ణమూర్తి (చిత్తూరు) ఉమాదేవి (అనంతపురం) ఎన్నిక కావడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *