గ్రీన్ కో ప్రాజెక్ట్ చంద్రబాబు విజన్ కు నిజమైన నిదర్శనం.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్

-2018లోనే ప్రాజెక్టు పెట్టేందుకు ఎంవోయూ కుదిరింది
-గ్రీన్ కో ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది.. మంత్రి టీజీ భరత్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2014లో తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న ముందు చూపుతో రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. 2018లో గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. సీఎం చంద్రబాబు గారి విజన్ కు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం అన్నారు.

అయితే ఈ ప్రాజెక్టును 2019లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ముఖ్యమంత్రి విజన్ గా కొందరు వ్యక్తులు ఇప్పుడు చెబుతున్నారని, అది ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే గత గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఎంతో జాప్యం చేసిందన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టును సరైన విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు లేదన్నారు. ప్రజలందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అప్పటి జీవో కాపీని చూస్తే విషయం అందరికీ తెలుస్తుందన్నారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రీన్ కో ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *