-కాలుష్యరహిత ఇంధన వాడకం ప్రోత్సహిద్దాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-తిరుపతి జిల్లా నుండి తిరుపతి,చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో AG&P ప్రథమ్–థింక్ గ్యాస్ కంపెనీ రూపకల్పన చేసిన పలు నూతన సి ఎన్ జి మరియు పి ఎన్ జి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఎజిఅండ్ పి(AG&P ) ప్రథమ్–థింక్ గ్యాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి
-తిరుపతి జిల్లా తిరుచానూరులో డొమెస్టిక్ పైప్లైన్ సహజ వాయు సరఫరా ప్రారంభం
-సిఎన్జి ఆధారిత వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
-గాజులమండ్యం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి), సిఎన్జి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
-శాలిడ్ వేస్ట్ సేకరణ కోసం సిఎన్జి వాణిజ్య వాహనాల(ఎల్సివి)ను తిరుపతి నగర మునిసిపల్ కమిషనర్కు అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి
-చిత్తూరులో ఎజిఅండ్ పి(AG&P ) ప్రథమ్ థింక్ గ్యాస్ సిఎన్జి మదర్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
నెల్లూరులోఎజిఅండ్ పి(AG&P )థింక్ గ్యాస్ ఎల్ సి ఎన్ జి స్టేషన్ కు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా దిద్దుతామని, కాలుష్యరహిత ఇంధన వాడకం ప్రోత్సహిద్దామని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా అందేలా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం స్థానిక తిరుపతి హోటల్ తాజ్ నందు ఎజీ అండ్ పి ప్రథమ్ – థింక్ గ్యాస్ వారిచే ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ముందుగా సిఎన్జి వాహనాల ర్యాలీని జెండా ఊపి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జపనీస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఏజీ ఎంపీ అండ్ పి ప్రథమ్ -థింక్ గ్యాస్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంధన రంగంలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన ఏజీ అండ్ పి మరింతగా తమ వాణిజ్య కార్యకపాపాలను విసరిస్తున్నందుకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తను తిరుచానూరులో ఏజీ అండ్ పి ప్రథం – థింక్ గ్యాస్ వారి ద్వారా డైరెక్ట్ పైపులైన్ ద్వారా గ్యాస్ అందించే కార్యక్రమ శ్రీకారం చుట్టి వారితో మాట్లాడానని అన్నారు.
ముఖ్యమంత్రి స్పీచ్ పాయింట్స్…..
తిరుచానూరు లో ఎ జి అండ్ పి గ్యాస్ కనెక్షన్ ను ప్రారంభి వారితో మాట్లాడాను.
ఈ రోజు తిరుపతి నుండి మంచి నూతన సి ఎన్ జి మరియు పి ఎన్ జి ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫ్యూయల్ ఎనర్జీ లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పొయ్యిలో వంటను చేసుకునే వాళ్ళం. మన రాష్ట్రం లో 1995 -96 ఎల్ పి జి కనెక్షన్లు మంజూరు చేసాం. ఇప్పుడు ప్రతి బి పి ఎల్ కార్డు కుటుంబానికి దీపం -2 క్రింద 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం.
స్వచ్చమైన , సురక్షితమైన సహజ వాయువుతో కూడిన సి ఎన్ జి పైప్ లైన్ తో ఇంటికి కనెక్ట్ చేయడం కార్యక్రమం శ్రీకారం చుట్టాం.
రాష్ట్రం క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వాడకంలో ముందుకెళ్లాలి
ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనుంది.
అందులో భాగంగా నేడు సి ఎన్ జి , పి ఎన్ జి సహజ వాయువుల కనెక్షన్లు ప్రారంభించాం.
ఎ జి అండ్ పి కంపెనీ ప్రస్తుతం రాజస్తాన్, కర్ణాటక, కేరళ ,తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సేవలు అందిస్తున్నారు. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. 28 జిల్లాలో 1500 CNG స్టేషన్లతో అందించ గలుగుతున్నారు. ఎ జి అండ్ పి సంస్థ గ్రీన్ హౌస్ ని పెంచడానికి, 2030 సంవత్సరానికి 15 శతం మార్కెట్ షేర్ లో ముందుకు వెళ్తున్నారని అందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
మన రాష్ట్రంలోని గోదావరి బేసిన్ ద్వారా 40 శాతం సహజ వాయువు ఉత్పత్తి జరుతోంది. దీనిని మన రాష్ట్రం లో ఉపయోగించుకునేదానికి పూర్తీ సహకారం అందిస్తాం.
2014 -19 లో భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, మెగా గ్యాస్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఎ జి అండ్ పి కంపెనీలకు 99 లక్షల కుటుంబాల కనెక్షన్లను మంజూరు చేయడం కోసం 11,120 కోట్ల పెట్టుబడి తో అనుమతులు 8 శాతం న్యాచురల్ గ్యాస్ ట్యాక్సెషణ్ తో ఇచ్చామని తరువాత గత 5 సంవత్సరాల్లో వీటిని నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం టాక్స్ 24 శాతం చేయడంతో ఈ సంస్థలు తమ కార్యక్రమాలు ఆపి ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5శాతంకు తగ్గించడం జరగిందని అన్నారు. కొన్ని నెలల ముందు శ్రీ సిటీ లో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ప్రారంభించామని గత 5 నెలలో ఈ కంపీనీ 51 కంపెనీలతో సంబంధాలు ఏర్పరుచుకున్నదని ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అభినందించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయని క్లీన్ ఎనర్జి , గ్రీన్ ఎనర్జి రాష్ట్రాలు, ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఇటీవల మన ప్రభుత్వం గ్రీన్ ఎనర్జి పాలసీని ప్రకటించిందని 10 లక్షల కోట్ల పెట్టుబడి, 7.5 లక్షల ఉపాధి టార్గెట్ తో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ – 2047 లక్ష్యంగా , రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంద్ర ప్రదేశ్ -2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఇందన ఖర్చును తగ్గించుకోవడం, గ్రీన్ హైడ్రోజన్ , క్లీన్ యనర్జి , గ్రీన్ యనర్జి, సి ఎన్ జి వంటి వాటిని ఉపయోగించడం, ప్రజలకు ఎలా అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ఇటీవల గౌ. ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్టణంలో ఎన్ టి పి సి , జెన్ కొ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును 1.80 వేల కోట్లతో ప్రారంభించారని తెలిపారు. అదే విధంగా రిలయన్స్ సంస్థ బయో ఫ్యూయల్ ను 60 వేల కోట్లతో 500 ప్రాంతాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. గ్రీన్ కో ద్వారా సోలార్ విండ్, పంప్డ్ ఎనర్జి వంటి వాటిపై అలాగే కాకినాడ పోర్ట్ నందు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు పై మన ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనున్నదని అన్నారు. మన ప్రభుత్వం వేస్ట్ నుండి ఎనర్జీ ని తయారుచేయడం, సాలిడ్ , లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ , గ్రీన్ ఎనర్జి పై దృష్టి పెట్టిందని అన్నారు. మన రాష్ట్రం సి ఎన్ జి కి అనువైన ప్రదేశమని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు సి ఎన్ జి అందితే బాగుంటుందని అన్నారు. మన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ తో పోటీ పడేలా ఉండాలని అన్నారు.
ఎ జి అండ్ పి కంపెనీ మన రాష్ట్రంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్ జిల్లాలలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ కలిగి ఉందని తెలిపారు. రానున్న 5 ఏండ్లలో 10 వేల కోట్ల పెట్టుబడి మరియు 10 వేల మందికి పైగా ఉపాధి అందిచేందుకు కృషి చేస్తోందని వీరికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లపుడు ఉంటుందని అన్నారు.
ఈ రోజు తిరుపతి నుండి తిరుచానూరులో డొమెస్టిక్ పైప్లైన్ సహజ వాయు సరఫరాను, సిఎన్జి ఆధారిత వాహనాలను ప్రారంభించుకున్నామని, గాజులమండ్యంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి), సిఎన్జి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను , చిత్తూరులో ఎజిఅండ్ పి(AG&P ) ప్రథమ్ థింక్ గ్యాస్ సిఎన్జి మదర్ స్టేషన్ ను, నెల్లూరులోఎజిఅండ్ పి(AG&P )థింక్ గ్యాస్ ఎల్ సి ఎన్ జి స్టేషన్ కు శంఖుస్థాపన చేసి ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామమని అన్నారు.
ఎనర్జీ సెక్టార్ లో భారత దేశానికి మంచి అవకాశాలు ఉన్నాయని , మన రాష్ట్రంలో పంప్డ్ ఎనర్జీకి మంచి అవకాశం ఉందని అలాగే సి ఎన్ జి, న్యాచురల్ గ్యాస్ కు మంచి డిమాండ్ ఉందని వీటన్నింటినీ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవాలని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాలకు పోటీగా నిలుస్తుందని అన్నారు. మన ప్రభుత్వం పెట్టుబడిదారులకు మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని పెట్టుబడి దారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మన రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించడం జరుగుతోందని ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయాన్ని కొత్త పద్దతులలో చేసి సహజ సిద్ధంగా పండించిన వాటిని తినేలా చేయడం కోసం కొత్త పద్దతులు అమలు చేస్తున్నామని తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. కొత్త పద్దతులు, కొత్త టెక్నాలజీలను అందరు అందిపుచ్చుకోవాలని అన్నారు.
ఎ జి అండ్ పి కంపెనీ రాష్ట్ర ప్రజలకు పి ఎన్ జి గ్యాస్ ను అందివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వంటివి, దేవాలయాల్లో కూడా పి ఎన్ జి గ్యాస్ వాడకం వంటివి వాటిని కోరడం జరిగిందని వాటిని పరిశీలిస్తామని , ఎ జి అండ్ పి సంస్థకు మా ప్రభుత్వం పూర్తీ సహకారం అందిస్తుందని అన్నారు. 2047 నాటికి తెలుగు జాతి కూడా పారిశ్రామికంగా నంబర్ వన్ గా ఉంటుందని ఆశ భావం వ్యక్తం చేసారు. క్లీన్ ఎనర్జీ మా ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. జపనీస్ తో మంచి సంబంధాలు ప్రభుత్వానికి ఉన్నాయని, వారు తమ పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టాలని కోరారు. ఎనర్జీ ఖర్చు లాజిస్టిక్ ఖర్చు తగ్గిస్తూ అలాగే కాలుష్య రహిత ఎనర్జీ లక్ష్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొడవైన సముద్ర తీరం ఉందని పోర్టులు విమానాశ్రయాలు హైవేలు కలిగి ఉన్నాయని పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి రాష్ట్రామని పేర్కొన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం మేము కృషి చేస్తున్నామని అన్నారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చామని విద్యుత్ రంగంలో మరిన్ని సంస్కరణలు రావాలని తెలిపారు సిఎన్జి ఉత్పత్తికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. మన రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని తెలిపారు. ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ముందుకు వెళ్ళామని ఇప్పుడు దానితో పాటు స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ తో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎజి అండ్ పి (AG&P ) ప్రథమ్ – థింక్ గ్యాస్ ఎండి,సిఇఒ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ రోజు గౌ.ముఖ్యమంత్రి ఒక పి ఎన్ జి కనెక్షన్ ను ప్రారంభించడం జరిగిందని త్వరలోనే 1 లక్ష ఇళ్ళకు కుడా ప్రభుత్వ సహకారంతో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో తమ సంస్థ పనిచేస్తోందని, ప్రజల జీవన నాణ్యతలో మార్పు తెచ్చే సహజ వాయువు పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి 700కి.మీ.లకు పైగా ఉక్కు, ఎండిపిఇ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసామని అన్నరు. ప్రస్తుతం తమ కంపెనీ ఆటోమోటివ్ విభాగానికి సేవలందించే 51 సిఎన్‌జి స్టేషన్‌ల బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందని, అలాగే దేశీయంగా 23,000 గృహాల వంట గదులకు చేరుకున్నామని, కాలుష్య రహిత పర్యావరణం కోసం సహకరించే క్రమంలో 50 పారిశ్రామిక – వాణిజ్య వినియోగదారులకు సహజ వాయువును సరఫరా చేస్తున్నామని అన్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో మా పెట్టుబడి 10,000 కోట్లను దాటనుందని, అలాగే 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిటీ లో ప్రారంభించిన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో తరువాతి 3 నెలల్లో అన్ని పరిశ్రమలకు న్యాచురల్ గ్యాస్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. తిరుపతిలో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు గ్రీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర నిబద్ధతను బలోపేతం చేస్తాయని, పరిశుభ్రమైన, పచ్చదనం, సంపన్నమైన పారిశ్రామిక భవిష్యత్తు వైపు రాష్ట్ర ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెట్టు బడుల మరియు ఇన్ఫ్రా స్ట్రక్చర్ శాఖా మంత్రి బి సి జనార్ధన్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ , చిత్తూరు ఎం పి దగ్గుమల్ల ప్రసాద్ రావు, తిరుపతి శాసన సభ సభ్యులు ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి శాసనసభ సభ్యులు పులివర్తి నాని, ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐ అండ్ ఐ ఎండి దినేష్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్, డా.ఎస్.వెంకటేశ్వర్ , ఎజి అండ్ పి (AG&P ) ప్రథమ్ థింక్ గ్యాస్ కంపెనీ సీనియర్ లీడర్‌షిప్ టీం , జపనీస్ పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జపనీస్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి సన్మానించారు.