తిరుచానూరులో ఎజి అండ్ పి ప్రథమ్ వారు అమర్చిన డొమెస్టిక్ పైప్ లైన్ నేచురల్ గ్యాస్ (పి ఎన్ జి ) సరఫరాను ప్రారంభించిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు

-లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడిన ముఖ్యమంత్రి
-వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తక్షణమే ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా తిరుచానూరులో నివాసముంటున్న శరవణ ఇంటిని సందర్శించి వారి కుటుంబ సభ్యులను కలిసి ఎజి అండ్ పి ప్రథమ్ వారు వినియోగ దారుడి ఇంటికి అమర్చిన డొమెస్టిక్ పైపులైన్ నేచురల్ గ్యాస్ (పి ఎన్ జి ) సరఫరాను రాష్ట ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఆదివారం సాయంత్రం స్థానిక పాత రేణిగుంట రోడ్డు తిరుచానూరు నందు లబ్ధిదారుడు శరవణ కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇంటికి ఎజి అండ్ పి ప్రథమ్ వారు అమర్చిన డొమెస్టిక్ పైప్లైన్ నేచురల్ గ్యాస్ ను ప్రారంభించి స్వయంగా టీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ
గ్యాస్ పైప్ లైన్ గురించి అడగగా వారు ఈ గ్యాస్ పైప్ లైన్ చాలా ఉపయోగకరంగా ఉందని ప్రతిసారి సిలిండర్లు అయిపోతే మళ్ళీ సిలిండర్ తెచ్చుకునే అంతవరకు ఇబ్బంది ఉండేదని ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని, 24 గంటలు గ్యాస్ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అన్నారు. మీటరు అమర్చుతారని ఎంత గ్యాస్ వాడితే దానికి మాత్రమే ప్రతినెల కరెంట్ బిల్లు లాగా గ్యాస్ బిల్లు కట్టుకోవడానికి చాలా సులభతరంగా ఉందని తెలిపారు. వారి వృత్తి, ఆర్థికపరమైన విషయాలు గురించి అడగగా తాను కార్పెంటర్ పని చేస్తున్నానని ప్రస్తుతం పనులు లేక రెండు ఆవులు ఉన్నాయని తెలిపారు. వారు తమకు సొంత ఇల్లు లేదని తెలుపగా అప్పటికప్పుడే రూ.3 లక్షల రూపాయలు గృహనిర్మాణ సంస్థ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తూ అదనంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్ష రూపాయలు మంజూరు చేసి, PMEGP క్రింద 4 ఆవులకు రెండు లక్షలు మంజూరు పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్ అండ్ బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, చంద్రగిరి, తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరని శ్రీనివాసులు, గాలి భాను ప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సుగుణమ్మ జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ప్రజా ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *