నారావారి పల్లి నందు భోగి పండుగ సంక్రాతి సంబరాలు…

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి, నారావారిపల్లి నందు నేటి సోమవారం ఉదయం నారావారి పల్లి గ్రామం నందు భోగి పండుగ సంక్రాతి సంబరాల సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు బెలూన్ బ్లాస్టింగ్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటల పోటీలు, విద్యార్ధినులకు బెలూన్ బ్లాస్టింగ్,గన్ని బ్యాగ్ రేస్ లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్, పొటాటో గ్యాదరింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనవడు పిల్లలతో కలిసి అందరిని ఉత్తేజపరుస్తూ ఉత్సాహంగా పాల్గొన్న నారా దేవాన్ష్. అలాగే గ్రామ మహిళలు సంప్రదాయకరమైన పాటలను పాడారు. ఈ పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో తిలకించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  మరియు వారి కుటుంబ సభ్యులు అనంతరం క్రీడా పోటీల నందు గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసారు. తరువాత పిల్లలతో కలసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటోలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమములో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి, పలమనేరు, నగరి శాసనసభ్యులు పులివర్తి నాని, అమర్నాథరెడ్డి, గాలి భాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *