-ఎంపి కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు
-సతీసమేతంగా భోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని శివనాథ్
-ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఏ పండుగ సంతోషంగా జరుపుకోలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ది పరంగా రాష్ట్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొని వుంటుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భోగి వేడుకల్లో ఎంపి కేశినేని శివనాథ్ , సతీమణి కేశినేని జానకి లక్ష్మీతో కలిసి పాల్గొని భోగి మంటలు వెలిగించారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి వేడుకల్లో భాగంగా ఎంపి కేశినేని శివనాథ్ చిన్నారులకు భోగిపండ్లు పోశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లేని విధంగా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవటానికి వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో రాష్ట్రానికి తరలిరావటం సంతోషంగా వుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్ అందించటంతో పాటు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయటంతోపాటు, అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో లేని విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు జీతం అందిస్తున్న విషయం పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముందు ఉద్యోగులకు పాత బకాయిలు సైతం చెల్లించటం జరిగిందన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణంలో మరింత పురోగతి సాధిస్తాయన్నారు. రాష్ట్రాభివృద్ది లో ప్రజలందరూ పాలుపంచుకోవాలని ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.
రాష్ట్రాభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎపి బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్చూరి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టి.ఎన్.ఎస్.ఎఫ్. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సాయిచరణ్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళితరత్న), టిడిపి రాష్ట్ర కార్యదర్శలు చెన్నుపాటి గాంధీ, గన్నే ప్రసాద్ (అన్న), రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ముమ్మనేని ప్రసాద్, టిడిపి నాయకులు జి.వి.నరసింహారావు, యెర్నేని వేదవ్యాస్, గొల్లపూడి నాగేశ్వరరావు, కొడూరు ఆంజనేయ వాసు, పటమట సతీష్, సంకె విశ్వనాథం, అబీద్ హుస్సెన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.