అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాపూజీ విద్యాలయం నందు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవాలులో 29వ రోజున 29వ పాశురాన్ని శ్రీ స్వామి వారు వివరించారు. అనంతరం గోదాఅమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి, మంగళ శాసనముతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో ఈరోజు చివరి రోజు కావున అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం శ్రీశ్రీశ్రీ తిరగండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగినది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గోదా రంగనాదుల అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భగవద్ బంధువులందరికీ శ్రీ స్వామివారి మంగళసూచనలు అందించారు. ఈరోజుతో ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు సుసంపన్నమయ్యాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బాపూజీ విద్యాలయాల నిర్వాహకులు శ్రీమాన్ తులసీరామ్ దంపతులు, శ్రీమాన్ నాగార్జున బాబు దంపతులకు శ్రీ స్వామి వారు అనేకనేక మంగళ శాసనాలు అందించారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …