నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయుట కొరకు మూడు సచివాలయాల పరిధిలోని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సూచనలు సలహాలు స్వీకరిస్తూ నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

– ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ప్యానెల్ 3 కిలో వాట్ ల వరకు ఏర్పాటు చేసుకుంటే 78 వేలు సబ్సిడీ, 2 కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 65 వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది.
– అలాగే తమ గృహానికి రోజుకు కావాల్సిన విద్యుత్ వాడుకుని అదనపు మిగులు విద్యుత్ ను విద్యుత్ శాఖకు ఇస్తే దాని ద్వారా కూడా మీకు ఆదాయం వస్తుంది.
– మీరు పెట్టే ఖర్చు మీకు తిరిగి నాలుగైదు సంవత్సరాల్లో తిరిగి వస్తుంది. ప్రజలు దీనిని వినియోగించుకోవాలి.
– దీని ద్వారా కరెంట్ బిల్లు లేని విద్యుత్ తయారు చేసుకోవచ్చు.
– ఈ సోలార్ విద్యుత్ విధానం ద్వారా పైసా ఖర్చు లేకుండా గృహాలకు విద్యుత్ ను, వాహనాలకు ఛార్జింగ్ చేసుకుని పెట్రోల్, డీజల్ ఖర్చు నుండి విముక్తి పొంది ప్రయాణాలు చేయవచ్చు.
– వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా కన్వర్షన్ కు అందరూ అందిపుచ్చుకోవాలి.
– వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ విధానం కూడా అమల్లోకి తీసుకొని వస్తున్నాం. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఎక్కువ సేపు ఛార్జింగ్ స్టేషన్ల వద్ద నిరీక్షణ లేకుండా ఉంటుంది.
– రాష్ట్రం పర్యావరణ హితంగా ఉండాలని e- వెహికల్స్ ను ప్రమోట్ చేయాలని దీనికి నారావారి పల్లిని ఒక ఆదర్శమైన నమూనాగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నా.
– ఇక్కడి రైతులు ప్రకృతి సేద్యంపై మక్కువ చూపాలి. పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేద్యం చేయడం వలన మంచి పంట తయారవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
– దేశంలోనే ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయం నేనే మొదటగా ప్రారంభించా. గత ఐదు సంవత్సరాలలో దీనిని పట్టించుకోలేదు
– ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటను నిర్థారించడానికి ఏజెన్సీ లు కూడా ఇపుడు ఏర్పాటు అవుతున్నాయి,వీటి ద్వారా పండించిన ఉత్పత్తి ఎక్కడ ఏ రైతు పండించాడు, వీటి నాణ్యత వంటి విషయాలు కూడా తెలుస్థాయి. ప్రపంచం ఇప్పుడు ప్రకృతి సేద్యం నుండి పండిచిన ఉత్పత్తులపై ఎక్కువ మక్కువ చూపుతోంది.
– ప్రకృతి సేద్యం కు డిమాండ్ అధికంగా ఉంది, రైతులు ప్రకృతి సేద్యం పై ఆసక్తి చూపించాలి.
– మైక్రో ఇరిగేషన్ చేయడం కోసం రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నాం.
– గతంలో వరి, చెరుకు వంటి పంటలు అధికంగా వేసేవారు, ప్రస్తుతం రైతులు హార్టికల్చర్ పంటలపై, డైరీ ప్రాడక్ట్స్ పై ఆసక్తి చూపుతున్నారు. తద్వారా మెరుగైన ఆదాయం చేకూరుతుంది. దీన్ని ప్రకృతి వ్యవసాయంతో పండిస్తే ఇంకా మంచి ఆదాయం వస్తుంది.
– వ్యవసాయంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, డ్రోన్ టెక్నాలజీ వినియోగం కూడా పెంచేందుకు శ్రీకారం చుట్టాం
– ఈ ప్రాంతంలో పశువులు ఉన్న ప్రతి ఒక్కరికి క్యాటిల్ షెడ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకొని పూర్తి చేయాలి. ఆదర్శవంతంగా ఉండేలా చూడాలి.
– 41 మంది బియ్యం కార్డులు లేని వారికి మంజూరుకి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సిఎం
– ఈనెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నాం. తద్వారా ఆధార్, కులం, నేటివిటీ, బర్త్ సర్టిఫికెట్లు, అడంగల్ వంటి 150 సర్వీసుల వరకు అందుబాటులోకి తీసుకొని రానున్నాం.
– సామాన్య మానవుడికి కూడా టెక్నాలజీ వినియోగించుకొని సేవలు పొందేలా రూపొందిస్తున్నాం. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఫోన్లోనే కావాల్సిన సర్టిఫికెట్, సేవలను సామాన్య ప్రజలు పొందే విధంగా వాట్సాప్ సర్వీసును తీసుకొని వస్తున్నాం.
– హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లో భాగంగా- నారావారి పల్లెలో ఉన్న ఆసుపత్రి 5 వేల మంది వరకు వైద్యం అందేలా మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటా. వైద్యం కోసం వచ్చే వారికి మధ్యాహం భోజన సౌకర్యం కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
– రంగం పేట నుండి భీమవరం, మంగళంపేట వరకు రోడ్లును రూ. 8 కోట్లతో పూర్తి చేస్తాం అదే విధంగా ప్రతి వీధికి సిసి రోడ్లు పూర్తి చేస్తాం
– ఈ ప్రాంతంలో విద్యార్థులు, గృహిణులు విద్యను మధ్యలో ఆపేసిన వారు చదువు కొనసాగించేలా, దాదాపుగా 500 మంది వరకు వచ్చి చదువుకునేందుకు, పని చేసేందుకు ఐ.టి టవర్ ఏర్పాటు చేస్తాం.
– వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి తద్వారా వారికి శ్రీసిటీ వంటి పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి కూడా కల్పిస్తాం.
– ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రేన్యూర్ తయారు కావాలి
– తిరుపతి – రేణిగుంట సమీపంలో ఒక 10 ఎకరాల స్థలంలో రతన్ టాటా స్ఫూర్తితో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు , ఇక్కడి యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడం కోసం చర్యలు తీసుకుంటాం.
– మన ప్రాంతంలోని వారికి శ్రీ సిటీ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్ తయారు అయ్యేలా కృషి చేస్తా
– కేర్ అండ్ గ్రో యాప్ ద్వారా చిన్న పిల్లలను ఆక్టివ్ గా
– ఈ ప్రాంతంలోని చెత్తను ౩ ఆటోల ద్వారా సేకరించి దీని నుండి కంపోస్ట్ గా తయరుచేసి చెత్త అనేది లేకుండా ఉండేలా పరిశుభ్రమైన ప్రాంతంగా మారుస్తాం.
– కళ్యాణి డ్యాం ను కూడా టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తా.
– ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శవంతంగా ఈ ప్రాంతం తయారు కావాలి
– ఇక్కడ అందరు రైతులు ముందుకొస్తే జడ్ బి ఎన్ ఎఫ్ కు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కు వంద శాతం కొరకు చర్యలు తీసుకుంటాం.
– రైతులు తమకు ప్రభుత్వం అందించే పథకాలు , అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
– గాడి తప్పిన పాలనను సరైన బాటలో పెట్టేందుకు ప్రభుత్వం పని చేస్తోందని మంచి అభివృద్ధిని కల్పిస్తాం.
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోలార్ పవన, పంప్డ్ ఎనర్జీ లో పర్యావరణ హితంగా ముందుకు వెళ్లనున్నాం.
ఈ కార్యక్రమంలో సిఎం గారితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, పూతలపట్టు ఎంఎల్ఏ మురళీ మోహన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పండుగ పూటా ప్రజాసేవలోనే

-సంక్రాంతి వేడుకలకు కుటుంబ సమేతంగా సొంతూరుకి సీఎం -క్షణం తీరిక లేకుండా అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు హాజరు -సీసీ రోడ్లు, పాఠశాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *