-నిల్వలు, బియ్యం నాణ్యత పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్న పౌరసరఫరాల గోడౌన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన గోడౌన్ మొత్తం కలియతిరిగి క్షుణంగా పరిశీలిం చారు. ఇటీవల కేంద్రం ప్రజలకు ఉచితంగా ఇచ్చిన నాన్ సార్టెక్స్ రైస్, ఆగస్టు నెల మొదటి విడతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సార్టెక్స్ రైను కలిసి నిల్వ చేశారా, విడి విడిగా నిల్వ చేసారా అని తనిఖీలు చేశారు. ఈ రెండు రకాల రైస్ లాట్స్ ఉన్న చోటకి వెళ్లి శాంపిల్స్ తీసుకుని బియ్యంలో నూక శాతం ఎంత ఉండాలి, తేమ శాతం ఎంత ఉండాలని గోడౌన్ ఇన్చార్జి అపర్ణను ప్రశ్నించారు. పురుగులు పట్టకుండా నిల్వ ఉంచే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆగస్టు నెలకు సంబందించి రేషన్ దుకాణాలకు బియ్యం ఇతర నిత్యావసరాలకు సంబందించి డీలర్లకు ఇస్తున్న ఆర్ వోలను ఎలా జనరేట్ చేస్తున్నారని ప్రత్యక్షంగా సిస్టమ్ ముం దు కూర్చుని పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న సంఘం అద్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, శివప్రసాదు గోడౌన్ లో డీలర్ వేలిముద్రతో సరుకులు కాటా వేసి ఇచ్చేలా చూడమని విజ్ఞప్తి చేశారు. గోడౌన్ నుండి నాలుగు మండలాలలో ఉన్న మొత్తం 450 దుకాణాల వరకు సరుకు రవాణా చేయాలంటే ఇబ్బందిగా ఉందని తద్వారా రేషన్ దుకాణాలకు సరుకు చేరడానికి జాప్యం అవుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సింగ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ గోడౌనన్ను యంఎ ఎస్ పాయంట్ గా మార్చి రెండు మండలాల దుకాణాలకు అక్కడి నుండి సరుకులు పం పినట్లయితే జాప్యం తగ్గుతుందని కోరారు. గోడౌన్లో మూడు టన్నుల కాటాలకు బదులు ఒకే సారి పెద్ద వే బ్రిడ్జి ఏర్పాటు చేసినట్లయితే కాటాల సమస్య ఉండదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డీలర్ సంఘ నాయకులు చేసిన విజ్ఞప్తిలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ ఎఎసీవో ఇ. విలియమ్స్, డిటి నందకుమార్, గోడౌన్ ఇన్ చార్జి అపర్ణ, ఇతర పౌరసరఫరాల అధికారులు పాల్గోన్నారు.