ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్నని కలిసిన షేక్ ఖలీఫాతుల్లాబాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె.లక్ష్మిప్రసన్నని ఒంగోలులోని వారి కార్యాలయంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ (BJMC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లాబాషా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు నగర శివారున వెంగముక్కపాలెంలో ఉన్న భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని దీని పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయన్న సమాచారంతో పాటు అక్కడి కార్మికులకు PF, ESI లు ఎంతమందికి వర్తిస్తున్నాయో దీనిపై సమగ్ర విచారణ జరిపించి అక్కడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అన్ని రంగాలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికుల భద్రత గుర్తింపునిస్తూ ఈ – శ్రమ్ కార్డును ఇవ్వడం జరిగింది, అయితే ఈ కార్డు గురించి చాలా మందికి తెలియక ఈ – శ్రమ్ కార్డు పొందలేకపోతున్నారని ఒంగోలు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అసంఘటిత కార్మికులు భద్రత దృష్టిలో ఉంచి తమ సిబ్బందితో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు అందేటట్లు చూడాలని కోరారు. కార్మికుల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అసంఘటిత కార్మికుల శ్రేయస్సు భద్రత దృష్టిలో ఉంచి తన పూర్తి సహకారం అందిస్తానని ఆర్డీవో లక్ష్మి ప్రసన్న హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *