-వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల జాయింట్ కమీషనర్ల సమీక్ష లో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశం
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఎస్టిమేట్స్ లో జిఎస్టీ, వ్యాట్ లాంటి వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.55,535 కోట్లు కాగా ఈ జూలై మాసాంతానికి 79.77 శాతం టాక్స్ వసూళ్లను సాధించిన వాణిజ్య పన్నుల శాఖ
-రూ.400 ల కోట్ల ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 63.23 శాతం వసూళ్లను అధికమించిన వాణిజ్య పన్నుల శాఖ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం పన్నుల రాబడి వసూళ్లలో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖకు నిర్దేశించిన లక్ష్యం, గడువు మేరకు వంద శాతం వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు కృషి చేయడంతో పాటు రాష్ట్ర వాణిజ్య పన్నుల వసూళ్ల నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపు దారులేవరూ టాక్స్ ఎగ్గొట్టకుండా ప్రతినెలా క్రమం తప్పకుండా రిటర్న్స్ ఫైల్ చేసే విధంగా వాణిజ్య పన్నుల శాఖ క్షేత్ర స్థాయి ఆధికారులు చర్యలు చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (రెవెన్యూ) రజత్ భార్గవ ఆదేశించారు. బుధవారం నాడు విజయవాడ నగరం ఈడ్పుగల్లులో ఉన్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమీషనర్ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు మరియు 13 జిల్లాల జాయింట్ కమీషనర్లతో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి జిఎస్టీ, వ్యాట్, ప్రఫెషనల్ టాక్స్ తదితర చట్టబద్ద వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్య సాధనపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2021-22) బడ్జెట్ ఎస్టిమేట్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జిఎస్టీ, వ్యాట్ లాంటి వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.55,535 కోట్లు కాగా గత నెల జూలై మాసాంతానికి 79.77 శాతం టాక్స్ వసూళ్లను, రూ.400 ల కోట్ల ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 63.23 శాతం వసూళ్లను, సాధించడం పట్ల వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆయన అభినందించారు. అయితే, సాధించిన పన్నుల రాబడితో సంతృప్తి చెందకుండా ఇంకా సాధించాల్సిన పన్నుల రాబడిపై విశేష శ్రద్ధ పెట్టాలని, అలాగే బడ్జెట్ ఎస్టిమేట్స్ లో నిర్దేశించిన వాణిజ్యపన్నుల రాబడిని వంద శాతం సాధించడంతో పాటు, రూ.1500 ల కోట్ల జిఎస్టీ, వ్యాట్ టాక్స్ వసూళ్ల అదనపు ఎస్టిమేట్స్ లక్ష్యాన్ని అలాగే రూ.200 ల కోట్ల ప్రొఫెషనల్ టాక్స్ అదనపు ఎస్టిమేట్స్ వసూళ్ల లక్ష్యాన్ని కూడా నిర్దేశిత గడువు లోపు అధికమించడానికి వాణిజ్య పన్నుల శాఖ క్షేత్ర స్థాయి అధికారులు ప్రణాళికా బద్దంగా పని చేయాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ సూచించారు. అదే విధంగా జూలై మాసంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ.186 కోట్ల పన్నుల రాబడిని సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ కమర్షియల్ టాక్స్ అధికారులను అభినందిస్తూ వాణిజ్య పన్నులను కట్టే పన్నుదారులు ఎవరూ కూడా టాక్స్ ఎగ్గొట్టకుండా పన్నుదారులు తమ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ను వంద శాతం క్రమం తప్పకుండా ఫైలింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని, ఒక వేళ వంద శాతం సాధ్యం కాకపోతే కనీసం 95 శాతం మంది ప్రతి నెలా టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేలా పన్నుచెల్లింపుదారులను మోటివేట్ చేయాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, కొంతమంది పన్ను ఎగవేత కోసం తమ వ్యాపార టర్న్ ఓవర్ ను తక్కువ చేసి చూపడం, టాక్స్ మినహాయింపు లేని అంశాలను టాక్స్ రిటర్న్స్ లో చూపడం, బోగస్ వ్యాపార సంస్థలను రిజిస్ట్రేషన్ చేయడం, ఇతరుల పేరుతో ఇన్వాయిస్ లను జారీ చేయడం, తక్కువ టాక్స్ కట్టడానికి వీలున్న హెడ్ కింద కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ను వర్గీకరణ చేసి చూపడం, జిఎస్టీ టాక్స్ చట్టంలోని కొన్ని నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకొని చూపెడుతూ టాక్స్ తక్కువ కట్టడం లాంటి జమ్మిక్కులకు పన్ను ఎగవేతదారులు పాల్పడుతూ ఉంటారని అందువల్ల కమర్షియల్ టాక్స్ అధికారులు చట్టబద్ద టాక్స్ వసూళ్ల నిబంధనలను తూ.చ.తప్పక పాటించి పన్నుఎగవేతదారుల పట్ల కఠినంగా ఉంటూ రూల్స్ మేరకు టాక్స్ కట్టించాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై టాక్స్ వసూళ్ల రూల్స్ మేరకు పెనాల్టీ విధించాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ కమర్షియల్ టాక్స్ అధికారులను ఆదేశించారు. అలాగే, వ్యాట్/ సీఎస్టీ చట్టం ప్రకారం పెండింగ్ టాక్స్ అస్సెస్మెంట్ ను నిర్ధారించి పాత పన్నుల బకాయిల వసూళ్లకు, పన్నుల రాబడికి సంబంధించి పెండింగ్ ఉన్న కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమీషనర్లు/అప్పీల్లేట్ అథారిటీల వద్ద పెండింగ్ ఉన్న వ్యాట్ టాక్స్ అప్పీల్స్ ను త్వరితగతిన పరిష్కరించడానికి, జాయింట్ కమీషనర్ల వద్ద ఉన్న టాక్స్ రివిజన్ పిటిషన్స్ పరిష్కారానికి, ఏజీ ఆడిట్ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ కమర్షియల్ టాక్స్ రాష్ట్ర ఉన్నతాధికారులను, జాయింట్ కమీషనర్లను ఆదేశించారు.