-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్న కాంటీన్ లో ఆహారం సేవించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఆహార నాణ్యత, ఇచ్చే టోకెన్లు, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు తమ తమ అన్న క్యాంటీన్ ను పరిశీలించి ఎటువంటి మరమ్మతుల ఉన్నా వెంటనే చేయించాలని. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్నా క్యాంటీన్లలో ఎటువంటి సమస్య తలెత్తకూడదని. అందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలని అన్నారు.
Prajavartha Online Telugu News